`ఎన్టీఆర్`కు భారతరత్న అంశంపై స్పందించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలన్న అంశంపై ఎంపీ కేశినేని నాని చేసిన విజ్ఞప్తి పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో `భారతరత్న` పురస్కారం ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే అంతిమ నిర్ణయం తీసుకుంటారని హోంశాఖ తెలిపింది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్లు హోంశాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలన్న అంశంపై ఎంపీ కేశినేని నాని చేసిన విజ్ఞప్తి పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో "భారతరత్న" పురస్కారం ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే అంతిమ నిర్ణయం తీసుకుంటారని హోంశాఖ తెలిపింది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్లు హోంశాఖ ప్రకటించింది.
ఎన్డీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో లోక్‌సభలో ఈ అంశాన్ని ఎంపీ కేశినేని నాని లేవనెత్తారు. 377 నిబంధన కింద స్వర్గీయ ఎన్డీఆర్‌కు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తాజాగా హోంశాఖ తన స్పందన తెలియజేసింది.