AP Elections 2024: ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులు, ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రగులుతోంది. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి గుడ్‌న్యూస్ అందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ మరి కొద్దిరోజుల్లో వెలువడనుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతూ ఇప్పటికే అభ్యర్ధుల్ని రంగంలో దించుతుంటే కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం-జనసేనలు ఇంకా సీట్ల సర్దుబాటులోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నుంచి అధికార పార్టీకు ఊరటనిచ్చే ఆదేశాలు వెలువడ్డాయి.
మరి కొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏప్రిల్ మొదటి లేదా రెండవ వారంలో ఎన్నికలు జరగవచ్చని అంచనా. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార పార్టీ చాలామంది అభ్యర్ధుల్ని ఖరారు చేయగా ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇంకా సీట్ల కేటాయింపునే దాటలేదు. ఈలోగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికార పార్టీకు ఊరటనిచ్చే నిర్ణయాలు వెలువడ్డాయి. ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ సచివాలయ ఉద్యోగులకు నో అబ్జక్షన్ జారీ చేస్తూ కొన్ని షరతులు విధించారు.
పోలింగ్ ఆఫీసర్‌కు అసిస్టెంట్‌గా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని నియమించాల్సి ఉంటుంది. చిన్న చిన్న పనులు అంటే ఓటరు వేలికి ఇంకు రాయడం వంటి పనులకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇతర పనులకు కూడా నిబందనలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ప్రతి పోలింగ్ సిబ్బందికి ఒక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగిని మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. బూత్ స్థాయి అధికారిగా వీరిని నియమించకూడదు.వాలంటీర్లు మాత్రం ఎన్నికలకు దూరంగానే ఉండాలి.
Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook