Polavaram project Funds: ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాజ్యసభ వేదికగా నిధుల విడుదలపై లెక్కలు వివరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు అందిన వివరాల ప్రకారం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ వరప్రదాయినిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.పోలవరం నిధుల గురించి రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వం(Central government)ప్రకటన విడుదల చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల గురించి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ సమాధానమిచ్చారు.8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేసిన నిధులు కేవలం 11 వేల 182 కోట్లు మాత్రమేనని తేలింది. 2014 నుంచి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ పనుల కోసం మాత్రమే ఈ నిధులు విడుదల చేసినట్టు స్పష్టం చేశారు మంత్రి. పోలవరం(Polavaram)నిర్వాసితులకు పునరావాసం, నిర్మాణం పనులతో పాటు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మొత్తం 55 వేల 657 కోట్లు ఖర్చు కానుందనేది అంచనా. అయితే కేంద్రం మాత్రం 8 ఏళ్లలో 11 వేల 182 కోట్లు ఇచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.


Also read: Ysr Kapu Nestham: రెండవ విడత వైఎస్సార్ కాపునేస్తం పథకం, లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook