Railway Zone: ఏపీకి కేంద్రం దసరా కానుక.. రైల్వే జోన్, భోగాపురం ఎయిర్ పోర్ట్ సహా పలు వరాలు..
Railway Zone: దసరా నవరాత్రుల సందర్భంగా కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కు పలు వరాలు ప్రకటించింది. రైల్వే జోన్, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు ప్రాజెక్టుల పూర్తి చేయడానికి తగిన సాయం అందిస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
Railway Zone: విభిజిత రాష్ట్రంలో పలు పెండింగ్ పూర్తి చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో జటిలమైన పలు సమస్యలన్నింటిని కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. 2047లో ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ లో కేంద్రం ఇది వరకే ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. అంతేకాదు పెండింగ్ లో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరినట్టు చెప్పారు.అంతేకాదు దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలసిన తర్వాత చంద్రాబాబు మీడియాతో పలు కీలక విషయాలను పంచుకున్నారు.
గత ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కు భూమి ఇవ్వకుండా తాత్సారం చేసింది. దీంతో రైల్వే జోన్ ఆలస్యమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి కాలయాపన చేయకుండా వెంటనే భూమిని కేటాయించాము. డిసెంబర్ లో విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ రైల్వే జోన్ లోనే వాల్తేరు రైల్వే డివిజన్ ఉంటుంది. మొత్తంగా ఎన్నో ఏళ్లుగా నానుతున్న జఠిలమైన సమస్యను పరిష్కరించామన్నారు.
హౌరా నుండి చెన్నై రెండు రైల్వే లేన్లను 4 లేన్లగా మార్చబోతున్నాము. దీంతో గూడ్స్, సాధారణ రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. దీంతో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ప్రతి పట్టణం అనుసంధానం అవుతుందన్నారు.
దీంతో ఏకకాలంలో ఎకనమిక్, పోర్టు డెవలెప్మెంట్ జరగుతుంది. దాంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
విజయవాడ నుంచి అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం అంగీకరించిందన్నారు. మచిలీపట్నం నుంచి రేపల్లె రైల్వే లైనుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. బుల్లెట్ ట్రైన్ ద్వారా అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పట్టణాల అనుసంధానం చేయాలి కోరామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. దేశం లోని కీలకమైన ఎకనమిక్ హబ్ ల గుండా బులెట్ ట్రైన్ ప్రయాణం సాగుతుందన్నారు. బులెట్ ట్రైన్ అనుసంధానంతో ఎకానమీ ఆక్టివిటీస్ పెరుగుతాయన్నారు.
2026 నుండి బులెట్ ట్రైన్ పనులు ప్రారంభం అవుతాయని సూచన ప్రాయంగా చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ రైల్వే స్టేషన్ ను ఆధునీకరణ పూర్తి చేయాలని కోరాము. నడికుడి టూ శ్రీకాళహస్తి, కోటపల్లి టూ నర్సాపూర్, కడప టూ బెంగళూరు లైన్ల కోసం మ్యాచింగ్ గ్రాంట్ అడిగిన విషయాన్ని ప్రస్తావించారు.
ఇప్పటికే రూ.75 వేల కోట్ల రైల్వే పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. వాటికీ తోడ పలు అభివృద్ది పనులు చేయనున్నాము. అంతేకాదు రాష్ట్రంలో అన్ని లెవల క్రాసింగ్ వద్ద ఫ్లై ఓవర్స్ గానీ.. అండర్ పాస్ లు నిర్మించేందుకు కేంద్రానికి సహకారం అందిస్తామన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఏపీలో పెట్టేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిపారు. దీంతో రాష్ట్రంలో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీకి డిమాండ్ పెరుగుతుంది. దీనిపై పైనా వర్కవుట్ చేయాలన్నారు. లాభనష్టాలు బేరీజు వేసుకుని ముందుకెళ్తాం.
అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వత పరిష్కారానికి తగిన రూట్ మ్యాప్ ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. దీనిపై ఆ శాఖ మంత్రి కుమార స్వామితో చర్చించమన్నారు. ప్రత్నామ్నాయ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. అంతేకాదు పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. మొత్తంగా 2047 స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ పై ప్రధానికి వివరించినట్టు చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టును 2025 నాటికి పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. అంతేకాదు భోగాపురం నుంచి విశాక బీచ్ కు ఈ రోడ్ అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు విజయవాడ నుండి హైదరాబాద్ కు ఎక్స్ ప్రెస్ హైవే ఏర్పాటు చేయాలని కోరాము. మరోవైపు అమరావతి చుట్టు 183 కి.మీ ఔటర్ రింగ్ రోడ్ పైనా కేంద్రం తో చర్చించాము. దీంతో పాటు రాష్ట్రంలో పలు అంశాలపై కేంద్రంతో చర్చించిన విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter