Ap Vaccination: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కానుంది. రాష్ట్రానికి అదనంగా కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పుంజుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ(Ap government) విజ్ఞప్తి మేరకు ఏపీకి  అదనంగా కోటి డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం (Central government) అందించనుంది. నిర్దిష్ట అర్హతలున్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించినందున కోటి డోసులు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మార్చి 26న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌కు లేఖ రాశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ఈ లేఖపై స్పదించారు. రాష్ట్రానికి ఇప్పటివరకూ 36 లక్షల 37 వేల డోసులిచ్చామని, వీలైనంత త్వరలో రాష్ట్రానికి అదనంగా వ్యాక్సిన్‌ పంపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 


పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలు పూర్తయి ప్రజా ప్రతినిధులు బాధ్యతలు చేపట్టారని, సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్‌ ( Vaccination) ప్రక్రియలో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 25 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. వాక్సిన్ తగినంత అందుబాటులో ఉంటే వ్యాక్సినేషన్‌ను ఉధృతంగా చేపడతామన్నారు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను మరింత ఉధృతం చేయాల్సిన అవసరముందని తెలిపారు.


Also read: AP Parishad Election 2021: ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు, పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల క్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook