Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్.. జనసేనానికి అమిత్ షా సంచలన బాధ్యతలు..?..
Pawan kalyan delhi tour: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతల్ని కలుసుకొవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పవన్ కు బీజేపీ అధిష్టానం సంచలన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తొంది.
Pawan kalyan meets with amitshah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల్ని కలుసుకొవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్నిరోజులుగా పవన్ సనాతన ధర్మం అంటూ కీలక ఉపన్యాసాలు చేస్తున్నారు. అంతే కాకుండా.. తిరుమల లడ్డు వివాదం సమయంలో కూడా ఒక్కసారిగా సనాతన ధర్మం కోసం కాపాడుకోవడానికి ఎంత దూరమైన వెళ్తానంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. దీంతో పవన్ ఒక్కసారిగా ఏపీలో హిందు ధర్మం కోసం పోరాడుతున్న యోధుడిగా కూడా వార్తలలో నిలిచారు.
మరోవైపు ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం నరసింహా వారాహి బ్రిగేడ్ అనే ప్రత్యేక వింగ్ ను సైతం ఏర్పాటు చేశారు. దీనిపై కూడా దేశ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది. అదే విధంగా ఏపీలో తాను హోంమంత్రి అయితే.. పరిస్థితి మరోలో ఉంటుందని వ్యాఖ్యలు చేయడం అంతే కాకుండా.. దూకుడుగా ముందుకు వెళ్లడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు.
ఇదిలా ఉండగా..పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీకి తొలిసారి వెళ్లారు. అక్కడ హోంమంత్రి అమిత్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అంతే కాకుండా.. పవన్ .. అమిత్ షాకు..విజయ నగరంకు మాత్రమే పరిమితమైన సవర కళ చిత్రంను అంందజేశారు. దీన్ని సవర గిరిజనులు తయారు చేస్తారు. ఈ కళను ప్రొత్సహించేందుకు పవన్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు తెలుస్తొంది. అయితే.. ప్రస్తుతం పవన్ కళ్యాన్ ఢిల్లీకి వెళ్లడం మాత్రం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ఇప్పటికే యూపీలో యోగిలాగా.. ఏపీలో పవన్ ఉన్నారని కూడా కొంత మంది ఆయనకు హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కు అమిత్ షా మహారాష్ట్ర లో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది . ప్రస్తుతం ఏపీలో పవన్ కు కొంత మంది బాల్ థాకరేలాగా హిందు ధర్మం కోసం పొరాడుతున్నారని అంటున్నారని, అలాంటి పవన్ ను మహా రాష్ట్రలో కీలక బాధ్యతలు అప్పగిస్తే.. బీజేపీకి ఇంకా అక్కడ పుంజుకుంటుందని కూడా భావిస్తున్నారంట. అందుకే పవన్ కు మహారాష్ట్రలో అమిత్ షా తొందరలోనే సంచలన బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.