ఏపీ రాజధాని ( Ap Capital ) విషయంలో కేంద్రం ( Central government stand ) మరోసారి తన వైఖరి స్పష్టం చేసింది. రాజధాని ఒక్కటే ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని సాక్షాత్తూ హైకోర్టుకు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశం ( Ap three capital issue ) ఇటు హైకోర్టు..అటు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ నేపధ్యంలో కేంద్ర వైఖరి చెప్పాలంటూ హైకోర్టు ( High court ) కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు హైకోర్టుకు తన వైఖరిని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి అనుబంధ పిటీషన్ ద్వారా తమ నిర్ణయాన్ని తేల్చిచెప్పింది. అసలు రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. సెక్షన్‌ 13 ప్రకారం రాజధాని అంటే ఒక ప్రాంతానికే పరిమితం కావాలని కాదని తెలిపింది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందని...అంతమాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఏదేమైనా సరే.. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని కేంద్రం తెలిపింది. Also read: AP: ఉచిత విద్యుత్ నగదు బదిలీపై అపోహలు వద్దు