AP: ఉచిత విద్యుత్ నగదు బదిలీపై అపోహలు వద్దు

ఏపీ వ్యవసాయ రంగంలో కొత్తగా అమలు చేయబోతున్న ఉచిత విద్యుత్ నగదు బదిలీపై అపోహలు వద్దని ప్రభుత్వం సూచిస్తోంది. సందేహాల్ని నివృత్తి చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు అజేయ కల్లం ముందుకొచ్చారు.

Last Updated : Sep 9, 2020, 06:24 PM IST
AP: ఉచిత విద్యుత్ నగదు బదిలీపై అపోహలు వద్దు

ఏపీ వ్యవసాయ రంగం ( Ap Agriculture sector ) లో కొత్తగా అమలు చేయబోతున్న ఉచిత విద్యుత్ నగదు ( Free power cash transfer ) బదిలీపై అపోహలు వద్దని ప్రభుత్వం సూచిస్తోంది. సందేహాల్ని నివృత్తి చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు అజేయ కల్లం ముందుకొచ్చారు.

ఏపీ వ్యవసాయ రంగంలో కీలకమైన మార్పు వస్తోంది. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ పధకాన్ని జోడిస్తోంది. అయితే దీనిపై ప్రతిపక్షం విమర్శలు చేస్తూ రైతుల్ని అభద్రతకు నెట్టే ప్రయత్నం చేస్తోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పధకంపై నెలకొన్న సందేహాల్ని నివృత్తి చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు అజేయ కల్లం ( Ap chief advisor Ajeya kallam ) మీడియా ముందుకొచ్చారు. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. Also read: AP: ఆ మహిళలకు కూడా వరమిచ్చిన వైఎస్ జగన్

వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ముఖ్య ఉద్దేశ్యం పగటి పూట 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడమే. దీనికి సంబంధించిన బిల్లు కోసం రైతుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ప్రభుత్వమే నగదు చెల్లిస్తుంది. నాణ్యమైన విద్యుత్‌ని అందిస్తున్న నేపథ్యంలో రైతుకు ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. గతంలో ప్రభుత్వం 16 వేల 371 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు బకాయి పడింది. ప్రతి మోటార్‌కు మీటర్ అమర్చడం ద్వారా నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత చౌకగా ఉచిత విద్యుత్‌ని అందిస్తాం అంటూ అజేయ కల్లం వివరణ ఇచ్చారు. 

9 గంటల్లో రైతు ఎంత విద్యుత్ ( 9 hours free power ) వినియోగించినా సరే అదంతా ఉచితమేనని అజేయ కల్లం స్పష్టం చేశారు. లక్ష వరకూ ఉన్న అనధికారిక కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తామని అజేయ్ కల్లం చెప్పారు.  రైతుల కోసం తెరిచే ప్రత్యేక బ్యాంకు అక్కౌంట్ కోసం బ్యాంకులు, విద్యుత్ అధికార్ల మధ్య ఒప్పంద కూడా జరగనుందని తెలిపారు. కౌలు రైతులకు కూడా దీనివల్ల ఎటువంటి ఇబ్బంది రాదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముందుగా డిసెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభం కానుందని...ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ నగదు బదిలీ అమలు చేస్తామని చెప్పారు.  Also read: AP: మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదు; వైఎస్ జగన్

Trending News