అనంతపురం పర్యటనలో ఉన్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం  కియా కార్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం సకాలంలో నిధులు ఇచ్చి ఉంటే తాము మరింత అభివృద్ధి చెందేవాళ్లమన్నారు. ఏపీ రావాల్సిన నిధుల కోసం ఢిల్లీ చుట్టూ ఇప్పటి వరకు 29 సార్లు తిరిగానన్నారు.  అందరితో సమాన స్థాయికి వెళ్లే వరకు రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాల్సిందేనని.. ఏపీకి దక్కాల్సినవన్నీ ఇచ్చే వరకు తాము కేంద్రానికి గట్టిగా నిలదీస్తామన్నారు. అయితే రోడ్లపైకి వచ్చి గొడవ చేస్తే దక్కేది శూన్యమన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోదాపై అడగాల్సినోళ్లకు అడగాలి..


ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఎవరిని అడిగితే వస్తుందో జనాలకు తెలుసు కానీ.. పాపం వైపీపీ వాళ్లకు తెలియడం లేదు.. వాస్తవానికి వాళ్లకు కావాల్సింది హోదా కాదు..ఓట్లు . అందుకే హోదా పేరు అడ్డం పెట్టుకొని నన్ను తిట్టడం పనిగా పెట్టుకున్నారు. హోదా విషయంలో కేంద్రానికి నిలదీయాలని వైపీసీ వాళ్లకు ఏపీ సీఎం చంద్రబాబు పరోక్ష సూచన చేశారని విశ్లేషకులు అభిప్రపాయపడుతున్నారు.