విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. నాడు విశాఖలో జగన్‌ను తిప్పి పంపిన తరహాలోనే నేడు చంద్రబాబును సైతం పోలీసులు తిప్పి పంపుతారేమో అనే చర్చ జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరాంధ్రలో ప్రజాచైతన్యయాత్ర చేసేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. విశాఖను పరిపాలన రాజధాని చేయడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్రలో పర్యటించబోమని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో... చంద్రబాబు కొన్ని గంటలుగా విశాఖ ఎయిర్ పోర్టుకు సమీపంలోనే నిలిచిపోయారు. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగే పరిస్థితి లేకపోవడంతో... అక్కడ ఏం జరుగుతుందో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 


చంద్రబాబును పోలీసులు మళ్లీ వెనక్కి తిప్పి పంపిస్తారా ? లేక భద్రత నడుము ఆయన ముందుకు సాగుతారా ? అన్నది మరికొద్దిసేపట్లో తేలిపోయే అవకాశం ఉంది. అయితే గతంలో విశాఖలో నాటి ప్రతిపక్ష నేత జగన్‌కు ఎదురైన పరిస్థితే నేడు చంద్రబాబుకు కూడా ఎదురవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2017లో జరిగిన ఒక ఘటనను పలువురు గుర్తు చేస్తుకుంటున్నారు. 


Read Also: అర్జున సినిమా ట్రెయిలర్ విడుదల


సరిగ్గా మూడేళ్ల క్రితం 2017 జనవరి 26న విశాఖపట్టణంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ క్యాండిల్ ర్యాలీ తలపెట్టింది. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఐతే ఆయన్ను అక్కడే అడ్డుకున్నారు పోలీసులు. భద్రతా కారణాల దృష్ట్యా జగన్, ఇతర వైసీపీ నేతలను అడ్డుకున్నట్లు చెప్పారు. దాంతో జగన్‌, విజయసాయిరెడ్డి, వైబీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు ఎయిర్‌పోర్టులో రన్‌వే పైనే బైఠాయించారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపించారు. దీంతో నాడు జగన్‌ను తిప్పి పంపిన తరహాలోనే నేడు చంద్రబాబును సైతం పోలీసులు తిప్పి పంపుతారేమో అనే చర్చ జరుగుతోంది