Suspension: తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్..మరో నలుగురు కూడా
తెలుగుదేశం ( Telugu desam party ) పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారా..ఈ లేఖ చూస్తే అదే అన్పిస్తోంది. ఈ లేఖను ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టడం సంచలనం కల్గిస్తోంది.
తెలుగుదేశం ( Telugu desam party ) పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారా..ఈ లేఖ చూస్తే అదే అన్పిస్తోంది. ఈ లేఖను ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టడం సంచలనం కల్గిస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1984లో జరిగినా...1995 ఆగస్టు నెల ఆ పార్టీకు ఈ చేదు అనుభవాన్ని మిగిల్చింది. పార్టీ వ్యవస్థాపకుడు అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావుకు ( former cm NT Ramarao ) వెన్నుపోటు పొడిచిన సందర్భమది. ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీ రామారావును దించి...తాను ఆ పదవిని అధిరోహించారు ఇప్పటి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీలో సంక్షోభం జరిగి ఇప్పటికి 25 ఏళ్లు. పార్టీకు వెన్నుపోటు పొడిచినవారిని అప్పుడేం చేశారు ఎన్టీ రామారావు. ముఖ్యంగా ఎవరిపై ఆయనకు కోపముండింది. ఇప్పటివారికి చాలా తక్కువమందికి తెలుసు ఈ విషయం గురించి. చంద్రబాబు నాయుడు సహా మొత్తం ఐదుమందిని పార్టీ నుంచి ఎన్టీ రామారావు సస్పెండ్ చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడితో పాటు కోటగిరి విద్యాధరరావు, మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్, అశోక్ గజపతి రాజుల పేర్లున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు అప్పటి స్పీకర్ కు స్వయంగా ఎన్టీ రామారావు లేఖ కూడా రాశారు. 1995 ఆగస్టు 25వ తేదీన ఈ లేఖ రాశారు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఇప్పుడీ లేఖను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ( Ycp Mp Vijaya sai reddy ) బయటపెట్టి..ట్వీట్ చేశారు.