ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ధర్మపోరాట దీక్షను విరమించారు. చిన్నారులు అందించిన నిమ్మరసాన్ని తాగి ఆయన దీక్షను విరమించారు. శుక్రవారం (ఏప్రిల్ 20) తన పుట్టినరోజు సందర్భంగా సీఎం ధర్మపోరాట దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ దీక్ష కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యమంత్రి విజయవాడలో దీక్షకు కూర్చొగానే.. కొన్ని జిల్లాల్లో మంత్రులు కూడా దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షకు మద్దతు ఇచ్చిన వారిలో సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, అశ్వినీదత్‌తో పాటు నటుడు శివాజీ, దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఉన్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 7 గంటలకు ముగిసింది. 


ఈ దీక్షలో చంద్రబాబుతో పాటు మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారా లోకేశ్‌, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని మొదలైనవారు పాల్గొన్నారు. అలాగే ఈ దీక్ష సందర్భంగాస్వాతంత్య్ర సమరయోధులు పావులూరి శివరామకృష్ణ చంద్రబాబుకు నూలుపోగు దండ వేసి సత్కరించారు. ఈ దీక్ష కేంద్రంపై ధర్మాగ్రహమని చంద్రబాబు తెలిపారు.