Chandrababu Case: చంద్రబాబు బెయిల్‌పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్
Chandrababu Case: ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం కల్గించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను ఏపీ ప్రభుత్వం సవాలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case: టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ను ఛాలెంజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. బెయిల్ మంజూరుపై తీవ్ర అభ్యంతరం తెలిపిన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది.
ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలుగా 52 రోజులు ఉన్నారు. అనంతరం ఆరోగ్య కారణాలతో అంటే కంటి చికిత్స కోసం 4 వారాల మధ్యంతర బెయిల్ పొందారు. ఆ తరువాత రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై విచారణ పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిన్న తీర్పు వెల్లడించిన ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా గతంలో ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనడంపై విధించిన ఆంక్షల్ని సడలించింది.
ఇప్పుడు హైకోర్టు మంజురు చేసిన బెయిల్‌ను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధిస్తోంది. బెయిల్ మంజూరు విషయంలో ఏపీ హైకోర్టు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని, ట్రయల్ కోర్టులో కేసు పెండింగులో ఉన్నప్పుడు బెయిల్ ఎలా ఇస్తారని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించనుంది. విచారణ కీలకదశలో ఉన్నప్పుడు హైకోర్టు జోక్యం సరికాదని, ట్రయల్ కోర్టు విచారణాంశాన్ని హైకోర్టు ఎలా నిర్ధారిస్తుందంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది. బెయిల్ మంజూరు చేసేటప్పుడు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి తీర్పు ఇవ్వడం ద్వారా దిగువ కోర్టు అధికారాల్లో హైకోర్టు జోక్యం చేసుకున్నట్టయిందని ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టు తీరు అసాధారణంగా ఉందని ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. గతంలో ఇదే కేసులో ఇవాళ్టి వరకూ మధ్యంతర బెయిల్ మంజూరైంది. అదే సమయంలో ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై విచారణపై స్టే నడుస్తోంది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
Also read: Supreme Court Collegium Issue: కొలీజియం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం, మరోసారి కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook