Chandrababu Bail Conditions: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో నిందితుడైన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ర్యాలీలు చేస్తామంటే బెయిల్ ఎందుకిస్తామని ప్రశ్నించింది. మెడికల్ బెయిల్‌ను కస్డోడియల్ బెయిల్‌గా పరిగణించకూడదని స్పష్టం చేసింది. అదనపు షరతులు ఉంటాయని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ కేసులో ఆరోగ్య కారణాలతో మద్యంతర బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. మెడికల్ బెయిల్ పొందినప్పుడు కచ్చితంగా షరతులు వర్తిస్తాయని తెలిపింది. చంద్రబాబుకు ఏ విధమైన అదనపు షరతులు విధించాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనను కోర్టు తిరస్కరించింది. ఇచ్చింది కేవలం మెడికల్ గ్రౌండ్స్‌పై కంటి వైద్య చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మాత్రమేనని, దీనిని కస్టోడియల్ బెయిల్‌గా పరిగణించకూడదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఇద్దరు డీఎస్పీలను చంద్రబాబు కార్యకలాపాల్ని పర్యవేక్షించేందుకు అనుమతించాలన్న సీఐడీ అభ్యర్ధనను సైతం కోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్ 31న బెయిల్ మంజూరు చేసేటప్పుడు విధించిన షరతులకు అదనపు షరతులు వరిస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తెలిపారు. 


చంద్రబాబు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ సీఐడీ సమర్పించిన ఆధారాల్ని పరిశీలించిన కోర్టు అదనపు షరతులు విధిస్తున్నట్టు తెలిపింది. చంద్రబాబు బహిరంగ ర్యాలీలు చేయడం లేదా నిర్వహించడం చేయకూడదని కోర్టు తెలిపింది. కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయకూడదని ఆదేశించింది. ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని చెప్పి ఉంటే మద్యంతర బెయిల్ ఎలా ఇచ్చి ఉండేవాళ్లమని కోర్టు ప్రశ్నించింది. కచ్చితంగా షరతులు వర్తిస్తాయని వెల్లడించింది. 


Also read: Balineni Issue: ప్రకాశం జిల్లాలో సంక్షోభం సమసినట్టేనా, సీఎం జగన్‌తో బాలినేని భేటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook