Balineni Issue: ప్రకాశం జిల్లాలో సంక్షోభం సమసినట్టేనా, సీఎం జగన్‌తో బాలినేని భేటీ

Balineni Issue: ఏపీ ప్రకాశం జిల్లా అధికార పార్టీలో నెలకొన్న సంక్షోభం దాదాపుగా సమసిపోయినట్టు కన్పిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్ని విషయాలు మాట్లాడారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2023, 09:59 PM IST
Balineni Issue: ప్రకాశం జిల్లాలో సంక్షోభం సమసినట్టేనా, సీఎం జగన్‌తో బాలినేని భేటీ

Balineni Issue: ప్రకాశం జిల్లా అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్ని తీవ్రంగా ఖండించారు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం అంతా సమసిపోయిందని స్పష్టం చేశారు. 

ప్రకాశం జిల్లా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గళం, బాలినేని పార్టీ మార్పు వార్తలకు తెరపడింది. తనకు పార్టీ మేరా ప్రసక్తే లేదని, ఆ ఉద్దేశ్యమే ఉంటే జగన్ వద్దకు వెళ్లలని స్పష్చం చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన ఇవాళ వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజవకర్గంలో జరుగుతున్న పరిణామాల్ని వివరించారు. ఇళ్ల స్థలాల సమస్యను జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 

జిల్లాలో ఇళ్ల పట్టాల సమస్యలకు సంబంధించి 4-5 రోజుల్లో నిధుల్ని విడుదలే చేస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇక ఒంగోలు నకిలీ డాక్యుమెంట్ల్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు చేయమని తానే కోరినట్టు చెప్పారు. సాధారణంగా తానెవరి జోలికి వెళ్లనని, ఎవరైనా తన జోలికి వస్తే క్షమించనని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 

తనను కలిసేందుకు అపాయింట్‌మెంట్ అవసరం లేదని, ఎప్పుడైనా రావచ్చని వైఎస్ జగన్ చెప్పినట్టు బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియా ముసుగులో ఎవరైనా తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాల్ని జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రకాశం జిల్లా ఎస్పీకు తనకు మధ్య ఏ విధమైన విబేధాలు లేవన్నారు. జిల్లాలో రాజకీయంగా ఉన్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. 

Also read: Chandrbabau Case: చంద్రబాబుకు అదనపు షరతులు విధించనున్నారా, రేపు తేల్చనున్న ఏపీ హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News