Chandrababu Bail: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్, రేపు వెల్లడిస్తామన్న హైకోర్టు
Chandrababu Bail: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరమౌతున్నాయి. ఆరోగ్య కారణాలతో మద్యంతర బెయిల్ కోసం దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Bail: తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్‌పై తీర్పుకు ఇంకా 9 రోజులున్నందున ఈలోగా మధ్యంతర బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించారు. మధ్యంతర, మెయిన్ బెయిల్ పిటీషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున కోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్, వర్చువల్‌గా సిద్ధార్ధ్ లూథ్రా వాదించారు. చంద్రబాబు కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించడం, ఇతర ఆరోగ్య సమస్యల్ని పరిగణలో తీసుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. అయితే చంద్రబాబుకు జైలులో ప్రభుత్వ వైద్యులు ఇస్తున్న వైద్యం, వైద్యుల నివేదికను పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. ఆపరేషన్ ఇప్పటికిప్పుడు అవసరం లేదని వైద్యులు చెప్పారన్నారు.
రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై వాదనలు విన్పించేందుకు సమయం కావాలని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ వచ్చిందని, మెరుగైన చికిత్స అవసరమని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. స్కిన్ ఎలర్జీ విషయంలో రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు. అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పు నవంబర్ 8న వెల్లడి కానున్న నేపధ్యంలో అప్పటి వరకూ మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తి కల్గిస్తోంది.
చంద్రబాబు దాఖలు చేసిన మెయిన్ బెయిల్, మద్యంతర బెయిల్ పిటీషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. రేపు బెయిల్ పిటీషన్‌పై నిర్ణయం వెలువడనుంది.
Also read: Vizianagaram Train Accident: రైలు ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి జగన్ పరామర్శ, మృతులకు నివాళులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook