Chandrababu Case: చంద్రబాబు కేసులో ఇవాళ కూడా ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. చంద్రబాబుని కస్టడీ కోరుతూ సీఐడీ పిటీషన్ ఏసీబీ కోర్టులో, బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు కానున్నాయి. ఈ రెండు పిటీషన్లపై కూడా ఇవాళ వాడివేడిగా వాదనలు కొనసాగనున్నాయి. అదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో నిన్న అర్ధరాత్రి  1 గంట సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు జైళ్లో ప్రత్యేక గదిని కేటాయించారు. ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్‌లో ఉంచారు. చంద్రబాబుకు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. 


ఏసీబీ కోర్టు చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగానే చంద్రబాబు తరపు న్యాయవాదులు రెండు పిటీషన్లు దాఖలు చేశారు. రిమాండ్ సమయాన్ని హౌస్ అరెస్టుగా పరిగణించాలని, సెంట్రల్ జైలులోనే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఇంట్లోంచి భోజనం తెచ్చుకునేలా అనుమతించాలని కోరారు. హౌస్ అరెస్టు అంశాన్ని కోర్టు నిరాకరించింది. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబుకు జైలులో ప్రత్యేకంగా ఉంచడమే కాకుండా ఇంట్లోంచి భోజనం, మందులు తెప్పించుకునేలా అనుమతిచ్చింది. 


మరోవైపు ఇదే కేసులో ఇవాళ రెండు కీలకమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుని కీలక సూత్రధారిగా భావిస్తున్నందున ఆయన్ను ప్రశ్నించాల్సిన అవసరముందని వారం రోజుల కస్డడీ కోరుతూ సీఐడీ ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై ఇవాళ వాడివేడిగా వాదన జరగనుంది. మరోవైపు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా చంద్రబాబుకు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. 


ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అదే సమయంలో పోలీస్ కస్టడీకు ఏసీబీ కోర్టు అనుమతిస్తుందో లేదా అనేది వేచి చూడాలి. 


Also read: Chandrababu Case: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు, స్నేహ బ్లాక్ ఖైదీ నెంబర్ 7691



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook