Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన రెండు కేసుల్లో విచారణ మరోసారి వాయిదా పడింది. ముఖ్యంగా టీడీపీ ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటీషన్ తీర్పు వాయిదా పడింది. దీపావళి తరువాతే తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ స్కాంలో సెక్షన్ 178ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమని, కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు సాగాయి. పూర్తి స్థాయిలో వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసి నిన్న అంటే నవంబర్ 8కు వాయిదా వేసింది. అయితే నిన్న తీర్పు వెల్లడి కాలేదు. ఇవాళ ఉదయం తీర్పు వెలువరిస్తుందనే అంతా ఆశించారు. ఎలాంటి తీర్పు వస్తుందో తెలియకపోయినా ఊరట లభించవచ్చనేది చంద్రబాబు తరపు న్యాయవాదుల ఆలోచన. అయితే ఇవాళ కూడా తీర్పు వెల్లడికాలేదు. దీపావళి సెలవుల తరువాత క్వాష్‌పై తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 


మరోవైపు ఏపీ ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై కూడా విచారణ ఈ నెల 30కు వాయిదా పడింది. స్కిల్ స్కాంలోని కొన్ని అంశాలు ఫైబర్ నెట్ కేసుతో ముడిపడి ఉన్నందున క్వాట్ పిటీషన్ తీర్పు తరువాతే పైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌పై విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. దీపావళి తరువాత అంటే ఈ నెల 23 లోగా తీర్పు రావచ్చని ఆశిస్తున్నారు.


ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఈ నెల 30 కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు అప్పటి వరకూ చంద్రబాబుని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు ఈ నెల 19 వరకూ ఉన్నాయి. స్కిల్ స్కాంలో లభించిన మధ్యంతర బెయిల్ నవంబర్ 28 వరకే ఉంది. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కావల్సి ఉంది. ఈలోగా ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటీషన్‌పై వచ్చే తీర్పుని బట్టి చంద్రబాబు తిరిగి జైలుకు వెళ్తారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. 


Also read: Delhi Pollution: కాలుష్యం తగ్గించేందుకు కొత్త ప్రయోగం, కృత్రిమ వర్షాలకు ఢిల్లీ ప్రభుత్వం ఆలోచన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook