Chandrababu: రాయలసీమకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు..
ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ప్రాంతాల అభివృద్దిపై చంద్రబాబు తన దృష్టిని కేంద్రీకరించినట్టు చెప్పింది. ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు విశాఖ అభివృద్దికి కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. అటు రాజధాని అమరావతిలో తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై నిలిచిపోయిన పనులను తిరిగి పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు గతంలో రాజధాని అమరావతిలో పలు కేంద్ర సంస్థలకు కేటాయించిన భూములను తిరిగి వాటికి అప్పగించనున్నారు. అంతేకాదు అమరావతిలో రైలు, రోడ్డు సహా పలు అభివృద్ది పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
Chandrababu good News To Rayalaseema: ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ప్రాంతాల అభివృద్దిపై చంద్రబాబు తన దృష్టిని కేంద్రీకరించినట్టు చెప్పింది. ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు విశాఖ అభివృద్దికి కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. అటు రాజధాని అమరావతిలో తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై నిలిచిపోయిన పనులను తిరిగి పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు గతంలో రాజధాని అమరావతిలో పలు కేంద్ర సంస్థలకు కేటాయించిన భూములను తిరిగి వాటికి అప్పగించనున్నారు. అంతేకాదు అమరావతిలో రైలు, రోడ్డు సహా పలు అభివృద్ది పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
కేవలం ఉత్తరాంధ్ర, రాజధాని అమరావతిలే కాకుండా.. రాయలసీమకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపిస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీశైలం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. సీఎం చంద్రబాబు చెప్పబోయే ఆ శుభవార్త ఏమిటా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు మనసులో ఏముంది? దేని గురించి మాట్లాడారు? అనే విషయంపై విశ్లేషణలు జరుగుతున్నాయి. తన ప్లాన్ సక్సెస్ అయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందంటూ సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో.. ఏదైనా భారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారా?
లేకపోతే.. రాయలసీమను ఆధ్యాత్మికంగా అభివృద్ధి పథంలోకి తీసుకొస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమెరికా పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ అనంతపురంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో.. ఈ దిశగా ఏమైనా ప్రకటన ఉంటుందా అనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతేకాదు అమెరికాలో కొత్తగా ట్రంప్ సర్కార్ ఏర్పడటంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలున్నాయి. మరోవైపు నరేంద్ర మోడీతో ట్రంప్ కు మంచి మిత్రత్వం ఉండటం కలిసొచ్చే అంశాలు అని చెప్పాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.