రామయపట్నం పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన ; 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు మరో పోర్టుకు శంకుస్థాపన చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించారు.ఈ సంద్భంగా ఆయన రామయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఉలవపాడు మండలం రామయపట్నం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021 కల్లా రామయపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేసి.. ఇక్కడ 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. పోర్టుపై విమర్శలు చేసే వాళ్లందరూ అభివృద్ధి నిరోధకులనని చంద్రబాబు ఆరోపణలు సంధించారు