AP govt: ఏపీ సర్కార్‌పై గవర్నర్‌కి చంద్రబాబు ఫిర్యాదు
అమరావతి: ఏపీ సర్కార్‌పై ( AP govt ) రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కి ఫిర్యాదు చేశారు. వైసిపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసే క్రమంలో చంద్రబాబు పలు ఉదంతాలను ఉదాహరణలుగా ప్రస్తావించారు.
అమరావతి: ఏపీ సర్కార్‌పై ( AP govt ) రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కి ఫిర్యాదు చేస్తూ ఇవాళ ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఉల్లంఘన, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం, వ్యక్తి స్వాతంత్య్రాన్ని అణిచివేయడం వంటివి అధికమయ్యాయని చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టుల కోసం క్రిమినల్ సెక్షన్లను ఫైలింగ్ చేయడం, పోలీసు విభాగంలోని కొంతమంది ఉన్నతాధికారులతో అధికార పార్టీ నాయకులు కుమ్మక్కవడం సాధారణమయ్యాయని చంద్రబాబు గవర్నర్ ( AP governor Biswabhushan Harichandan ) దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను పునరుద్దరించాల్సిందిగా గవర్నర్‌ని కోరిన చంద్రబాబు.. హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
( Also read: AP: రాష్ట్రపతి కోవింద్‌తో టీడీపీ ఎంపీల భేటీ )
వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు పలు ఉదంతాలను ఉదాహరణలుగా ప్రస్తావించారు. కారులో తరలిస్తున్న రూ 5.27 కోట్లు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుల వద్ద తమిళనాడు పోలీసులు పట్టుకున్నారని సోషల్ మీడియాలో ( Social media ) పోస్ట్ చేసినందుకు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, నాయుడుపాలెం గ్రామంలోని వడ్డెల సందీప్ కుమార్, తొట్టెంపూడి చంద్రశేఖర్‌లను 2020 జూలై 16న అరెస్టు చేశారని చంద్రబాబు నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. ( Also read: Notice to Twitter: ట్విటర్‌కి భారత్ నోటీసులు )
తమిళనాడు ( TamilNadu ) అంతటా తమిళ మీడియాలో ఈ ఘటనపై అనేక వార్తలు ప్రసారం అయ్యాయి, ప్రచురితమయ్యాయని.. కానీ ఏపీలో మాత్రం పట్టుబడిన నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో రాశారనే నేరం కింద సందీప్, చంద్రశేఖర్‌లను పోలీసులు అరెస్టు చేశారని హింసించారని చంద్రబాబు గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు.(Also read: IIT admissions: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీల్లో ప్రవేశానికి తొలగిన అడ్డంకి )