Notice to Twitter: ట్విటర్‌కి భారత్ నోటీసులు

Twitter hacking updates: న్యూ ఢిల్లీ: ట్విటర్‌కి భారత ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ హ్యాకింగ్‌కి గురైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ( Bill Gates), ఎలోన్ మస్క్ ( Elon Musk ) లాంటి ఎంతో మంది ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాకింగ్‌కి గురవడం సంచలనం సృష్టించింది.

Last Updated : Jul 18, 2020, 06:13 PM IST
Notice to Twitter: ట్విటర్‌కి భారత్ నోటీసులు

Twitter hacking updates: న్యూ ఢిల్లీ: ట్విటర్‌కి భారత ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ హ్యాకింగ్‌కి గురైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ), మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ( Bill Gates), ఎలోన్ మస్క్ ( Elon Musk ) లాంటి ఎంతో మంది ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాకింగ్‌కి గురవడం సంచలనం సృష్టించింది. ఈ హ్యాకింగ్ ట్విటర్ ఖాతాల భద్రతపై అనేక సందేహాలు తలెత్తేలా చేసింది. ఎంత విలువైన సమాచారం తస్కరణకు ( Data theft ) గురైందోననే ఆందోళనల ప్రముఖుల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ట్విటర్ హ్యాకింగ్ ఘటనను తీవ్రంగానే పరిగణించిన భారత్... గత వారం జరిగిన హ్యాకింగ్‌లో ఎంత మంది భారతీయులు హ్యాకింగ్ బారిన పడ్డారని తెలుసుకునే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే శుక్రవారం రాత్రి ట్విటర్ సంస్థకు నోటీసులు జారీచేసింది. ( Also read: యాంకర్ అనసూయ #CybHer క్యాంపెయిన్‌.. ఎనర్జిటిక్ వీడియో )

భారత ప్రభుత్వం సైబర్ సెక్యురిటీ వ్యవహారాలు నిర్వహిస్తున్న నోడల్ ఏజెన్సీ CERT-in భారత ప్రభుత్వం తరపున ఈ నోటీసులు జారీచేసింది. ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాక్ చేసిన హ్యాకర్స్.. మీరు ఈ కింది ఖాతాకు ఎన్ని డాలర్స్ పంపిస్తే.. అంతకు రెట్టింపు డబ్బు తిరిగి మీకు పంపిస్తాం అంటూ వారి హ్యాండిల్స్ నుంచి ట్వీట్ చేశారు. ఉదాహారణకు మీరు 1,000 డాలర్స్ పంపిస్తే... నేను తిరిగి 2,000 డాలర్స్ పంపిస్తానంటూ జో బిడిన్ ( Joe Biden ) ట్విటర్ ఖాతా నుంచి హ్యాకర్స్ చేసిన ట్వీట్‌ని మనం ఇక్కడ గమనించొచ్చు. ( Also read: IIT admissions: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీల్లో ప్రవేశానికి తొలగిన అడ్డంకి )

Trending News