Chandrababu Naidu: తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల మధ్య విమర్శలు, సవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెచ్చిపోయారు. సంతకం చేయకుండా వేషాలు వేస్తూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిపై నమ్మకం లేకుండా సంతకాలు చేయడం లేదని మండిపడ్డారు. అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirumala laddu row: చంద్రబాబు మళ్లీ అడ్డంగా దొరికి పోయారు.. మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..


 


తిరుమల పర్యటన రద్దు అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నీకు తిరుమల వెళ్లడానికి ఇష్టం లేదు. వెళ్తే నాకు స్వామి వారి మీద నమ్మకం అని సంతకం పెట్టాలి. నీకు అలా స్వామి అంటే నమ్మకం అని సంతకం పెట్టటం ఇష్టం లేదు. అది నీ సమస్య' అని పేర్కొన్నారు. 'స్వామి వారి గుడికి దళితులు రానివ్వరు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నువ్వు తిరుమల గుడికి వెళ్లకుండా.. నువ్వు సాకులు వెతుక్కుంటూ.. దళితులను ఎందుకు లాగుతావు?' అని నిలదీశారు.

Also Read: Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..


 


'తిరుమల ఆలయానికి వెళ్లకుండా సాకులు వెతుక్కున్నాడు. నిన్ను గుడికి వెళ్లొద్దు అని పోలీసులు నోటీసులు ఇచ్చారా ? నీకు దమ్ముంటే.. నువ్వు గుడికి వెళ్లవద్దు అని పోలీసులు నోటీసులు ఇచ్చి ఉంటే చూపించు. ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నావు' అని జగన్‌పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. 'తిరుమలకు వెళ్లవద్దు అని అన్నట్లు జగన్ మాట్లాడుతున్నాడు.. నీకు ఏమైనా నోటీసు ఇచ్చారా...ఇస్తే చూపించు' అని సవాల్‌ విసిరారు. 'ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. వాటిని పాటించాలి. ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు వెళ్తే అక్కడ సంప్రదాయాలు పాటించాలి' అని సూచించారు.


'లడ్డూ కల్తీ అంశంపై తిరుమల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుమల ఏడుకొండల స్వామి దేవాలయం అతి పెద్ద పుణ్యక్షేత్రం. అలాంటి దేవాలయం నిబంధనలు ఎవరైనా పాటించాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 'బైబిల్ చదువుతా అన్నారు సరే. ఇతర మతాలను కూడా గౌరవించాలి. నేను హిందువుని వెంకటేశ్వర స్వామిని పూజిస్తా. చర్చికి వెళ్లి అక్కడ నిబంధనలు పాటిస్తా' అని వివరించారు.


'నేను ఎక్కడ తప్పు చేశా అని అంటున్నాడు. నేను ఎక్కడ తప్పు చేశా. టెండర్‌లలో అనేక మార్పులు ఎందుకు చేశారు. టీటీడీలో భోజనం బాగోలేదని.. ప్రసాదం బాగా లేదని భక్తులు ఆందోళనలు చేశారు. అనేక దేవాలయాల్లో కూడా వాళ్లు ఇలాగే చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరిచ్చారు?' అని చంద్రబాబు ప్రశ్నించారు. 'టీటీడీకి వెళ్తే సంతకం చేయాలి.. సంతకం చేయడం ఇష్టం లేదు.. అందుకే ఇలా చేస్తున్నారు' అని సీఎం చంద్రబాబు తెలిపారు.


'వైఎస్‌ జగన్‌కి విశ్వసనీయత లేదు. దేవుడి భక్తుడిగా చెపుతున్నా. ఇష్టం లేకుంటే వెళ్లకండి. వెళితే అక్కడ రూల్స్ పాటించాలి. సీఎంగా ఉండి చట్ట వ్యతిరేకంగా పని చేశావు. కాబట్టి అక్కడ ఇలాంటి అపచారాలు జరిగాయి. జగన్‌ ఎందుకు తిరుమలకు ఎందుకు వెళ్లలేదో ఆయనే చెప్పాలి. మీరు సంప్రదాయాలు పాటించాలి. వెంకటేశ్వర స్వామిని పైరవీలు కోసం వాడారు. సిట్ అన్ని అంశాలు పరిశీలిస్తుంది' సీఎం చంద్రబాబు వివరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.