Bjp madhavi latha fires on former cm jagan on laddu declaration issue: తిరుమల లడ్డువివాదం దేశంలో పెను దుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ ను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ దీనిపై ప్రాయిశ్చిత దీక్షను చేపట్టారు. ఈ క్రమంలో కేంద్రం కూడా దీనిపై సీరియస్ అయ్యింది. కోట్లాది హిందు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా గత సీఎం వైఎస్ జగన్ తిరుమలలోలడ్డు కల్తీకి పాల్పడ్డాడంటూ కూడా చంద్రబాబు మండిపడ్డారు. అంతేకాకుండా.. జంతువుల కొవ్వు, చేపనూనెల వంటివి తిరుమల లడ్డులో ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్ లను సైతం చంద్రబాబు బైటపెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా హిందుసంఘాలు భగ్గుమన్నాయి.
మరోవైపు ఏపీలోని దేవాలయాలన్నింటిలో కూడా ప్రాయిశ్చిత కార్యక్రమంలో చేపట్టాలని కూడా.. చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైసీపీ కూడా అదే విధంగా కౌంటర్ ఇస్తుంది. లడ్డు వివాదంను కేవలం చంద్రబాబు డైవర్డ్ చేసేందుకు తెరమీదకు తీసుకొచ్చాడని కూడా జగన్ మండిపడ్డారు. అంతేకాకుండా.. తిరుమలను 28న దర్శించుకుంటానని ప్రకటించారు. దీంతో ఏపీలో మరో నిప్పురాజుకుంది. అన్యయమతస్తులు తిరుమలను దర్శించుకున్నట్లైతే..శ్రీవారి మీద తమకు నమ్మకముందని డిక్లరేషన్ పై సంతకంచేస్తారు.
గతంలో అబ్దుల్ కలాం, సోనియా గాంధీ వంటి చాలా నేతలు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ లపై సంతకం చేశారు.కానీ జగన్ మాత్రం ఆ పనిచేయలేదు. తాజాగా, ఆయన తిరుమల వస్తాననిప్రకటించడంతో తప్పనిసరిగా డిక్లరేషన్ చేయాలని కూడా కూటమి, బీజేపీ, హిందు సంఘాల నుంచి డిక్లరేషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణకు చెందిన బీజేపీ మాధవీలత శ్రీవారికి దర్శించుకునేందుకు తిరుమల వెళ్లారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా గత జగన్ సర్కారు ప్రవర్తించిందని మండిపడ్డారు. గతంలో 18 సార్లు కల్లీ నెయ్యి మీద రిపోర్టులు వచ్చాయని జగన్ అంటున్నారు. మరీ అప్పుడు ఎందుకు ఘటనను చెప్పలేదు. ప్రాయిశ్చిత్తాలు ఎందుకు చేయలేదని మండిపడ్డారు.అంతేకాకుండా.. ఇతర మతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు తప్పకుండా డిక్లరేషన్ పై సంతకం చేస్తారు. జగన్ కూడా తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాలని అన్నారు.
Read more: Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..
ఒక వేళ కుదరదని మోండికేస్తే.. కొండ కిందే ఆపేయాలని కూడా మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కేవలం రాజకీయాల కోసం, శాంతి భద్రతల పరంగా ఇబ్బందులు కల్గజేసేందుకు తిరుమలకు వస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే తిరుపటి జిల్లా వ్యాప్తంగా అక్టోబరు 25 వరకు పోలీసులు ప్రత్యేకంగా పోలీసుయాక్ట్ ను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.