YS Jagan: ఆంధ్రప్రదేశ్‌కు ఉరితాడు బిగిస్తారా సీఎం గారు? చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
YS Jagan Mohan Reddy Fire On Chandrababu Failures In Seasonal Diseases Control: ఆంధ్రప్రదేశ్‌లో సీజనల్ వ్యాధులు ప్రజల ప్రాణాలు తీస్తుండడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును నిలదీశారు.
YS Jagan Mohan Reddy: వర్షాకాలం సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ అనారోగ్యం బారిన పడింది. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియాతో ఇతర వ్యాధులు తీవ్రంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజారోగ్య రంగానికి ఉరితాడు వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అనారోగ్య పరిస్థితులపై 'ఎక్స్' వేదికగా నేరు సీఎం చంద్రబాబునే జగన్ ప్రశ్నించారు.
Also Read: Chandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలు
'రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోంది. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక వైద్యులు, సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. ఇంకోవైపు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని నీరు గారుస్తున్నారు' అని జగన్ ఆరోపించారు. మీ పాలనలో ప్రజలు తమ ఆరోగ్యం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఐదు వైద్య కళాశాలను ఉద్దేశపూర్వకంగా ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. మీ అసమర్థతను తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్
ఈ సందర్భంగా వైద్య రంగానికి తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన సేవలను మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చినట్లు గుర్తుచేశారు. 'అన్ని వసతులూ ఉన్నా చంద్రబాబు వైఖరి కారణంగా వైద్య రంగానికి గ్రహణం పట్టింది. కేంద్ర ప్రభుతంలో ఉన్నా వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకురాకపోవడం మీ వైఫల్యంకాదా' అని జగన్ ప్రశ్నించారు.
వైద్య కళాశాలలన్నింటినీ ప్రైవేటుపరం చేసి సామాన్యులపై భారం మోపే విధానాల్లోకి వెళ్తున్నారని చంద్రబాబును జగన్ దుయ్యబట్టారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోండని చంద్రబాబుకు హితవు పలికారు. వెంటనే వైద్య కళాశాలలు ప్రారంభించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా జగన్ కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.