Chandrababu Nightout Review: అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతోంది. ఆస్తి, ప్రాణనష్టం భారీగా సంభవిస్తుండడంతో ఏపీ ప్రజలు చిగురాటకులా వణుకుతున్నారు. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ చర్యలపై దృష్టి పెట్టారు. శనివారం రోజు మొత్తం వర్షాలపై సమీక్ష చేపట్టారు. జిల్లాలవారీగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూనే ప్రజాప్రతినిధులను సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని ఆదేశించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tragedy Incident: టీచర్స్‌ డే ముందే విషాదం.. విద్యార్థుల ప్రాణాలు కాపాడుతూ టీచర్‌ జల సమాధి


వర్షాలపై అన్ని శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష చేశారు. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం సమీక్షించారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీఓలు, డీఎస్పీలతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు.

Also Read: Trains Cancelled: కుండపోత వర్షాలు.. ఆంధ్రపదేశ్‌లో భారీగా రైళ్లు రద్దు


 


భారీ వర్షాల కారణంగా 8 మంది మృత్యువాతపడినట్లు తెలియడంతో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు చెప్పారు. రాత్రి అంతా మెలుకువతో ఉండి అయినా సరే ప్రజల రక్షణ కోసం పని చేద్దామని సూచించారు. తుపాను తీరం దాటాక నష్టం తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గేవరకు అత్యవసరమైతేనే బయటకు రావాలని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


భారీ వర్షాలు కురిసిన జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్లు, తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు రూ.2 కోట్లు చొప్పున నిధుల విడుదలకు సీఎం ఆదేశించారు.    విజయవాడ నగరంలో పరిస్థితిపై ప్రత్యేకంగా సమీక్షించారు. కొండ చరియలు విరిగి పలువురు మృతిచెందడంపై విచారం వ్యక్తం చేశారు. పెదకాకాని ఉప్పలపాడు వాగులో కారు కొట్టుకుపోయి టీచర్‌తో సహా ముగ్గురు మృతి చెందిన ఘటనపై అధికారులను వివరణ కోరారు. భారీ వర్షాల ప్రభావిత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని సీఎం ఆదేశించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter