Teacher Students Died: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అల్లోకల్లోలమవుతోంది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ క్రమంలో భారీగా ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలోనే ఓ విషాద సంఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. వాగులో ప్రవహిస్తుండగా విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయాణించిన టీచర్ వారితోపాటు జల సమాధి అయ్యారు. టీచర్స్ డేకు కొన్ని రోజుల ముందే ఈ విషాద సంఘటన చోటుచేసుకోవడం అందరినీ కలచివేస్తోంది.
Also Read: Trains Cancelled: కుండపోత వర్షాలు.. ఆంధ్రపదేశ్‌లో భారీగా రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో గుంటూరు జిల్లా ఉప్పలపాడులో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఉప్పలపాడులోని వాగు పొంగిపొర్లింది. అయితే ఇది తెలియని వివా స్కూల్ టీచర్ రాఘవేంద్ర (38) తన విద్యార్థులు సాత్విక్ (6), మానిక్ (9)తో కలిసి కారులో ముందుకు వెళ్లారు. అయితే వరద తీవ్రతను ఊహించకపోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు వాగులో మునిగిపోయింది.
Also Read: RK Roja: పార్టీ మార్పుపై ఆర్‌కే రోజా సంచలన ప్రకటన.. తిరుమలలో మళ్లీ వివాదం
మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామానికి చెందిన నడుంపల్లి రాఘవేంద్ర గణితం ఉపాధ్యాయుడిగా పని చేస్తుండేవారు. ఉప్పలపాడుకు చెందిన పసుపులేటి సౌత్విక్ రెండో తరగతి చదువుతుండగా.. కోడూరి మానిక్ మూడో తరగతి చదువుతున్నాడు. వర్షాల నేపథ్యంలో ముందే పాఠశాలను వదిలిపెట్టడంతో విద్యార్థులు తమ టీచర్ రాఘవేంద్రతో కలిసి బయల్దేరినట్లు తెలుస్తోంది. వాగులో వీరి కారు చిక్కుకున్న సమయంలో కాపాడేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ వరద ఉదృతి తీవ్రంగా ఉండడంతో టీచర్‌తో సహా విద్యార్థులు ముగ్గురు నీటిలో మునిగి చనిపోయారు. అతి కష్టంగా కారును తాళ్లతో కట్టి ఒడ్డుకు చేర్చిన స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. కానీ అప్పటికే ఆ ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటనతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
టీచర్ సాహసం
వాగులో మునుగుతున్నా విద్యార్థులను కాపాడేందుకు టీచర్ రాఘవేంద్ర తీవ్రంగా కృషి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనలో విద్యార్థులను కాపాడేందుకు టీచర్ సాహసం చేశారు. కానీ భారీ వరద ముందు ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా విద్యార్థులతోపాటు ఆయన జల సమాధి అయ్యారు. ఈ సంఘటనతో వివా స్కూల్‌లో విషాదం అలుముకుంది. టీచర్ సాహసాన్ని పాఠశాల యాజమాన్యం కీర్తించింది. టీచర్, విద్యార్థుల మృతితో సెప్టెంబర్ 5వ తేదీన జరగాల్సి ఉపాధ్యాయ దినోత్సవం విషాదంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.