Trains Cancel Due To Heavy Rains: రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న వరుణుడు ఇంకా విజృంభిస్తున్నాడు. శనివారం ఒక్కరోజే తీవ్ర రూపం దాల్చడంతో ఏపీలోని అన్ని జిల్లాలు వరదల్లో మునిగాయి. అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో రవాణా సౌకర్యానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ముందే అప్రమత్తమైంది. అతి భారీ వర్షాల నేపథ్యంలో భారీగా రైళ్ల రాకపోకలను రద్దు చేసింది.
Also Read: RK Roja: పార్టీ మార్పుపై ఆర్‌కే రోజా సంచలన ప్రకటన.. తిరుమలలో మళ్లీ వివాదం
వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణకులు, వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ పలు సూచనలు చేసింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పరిస్థితి భయానకంగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే సత్వర చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. శని, ఆది, సోమవారాల్లో దాదాపు 20 రైళ్ల వరకు రద్దు చేసినట్లు సమాచారం ఇచ్చింది.
విజయవాడ-తెనాలి, విజయవాడ-గూడూరు, తెనాలి-రేపల్లె, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు, గుంటూరు-రేపల్లె, విజయవాడ-మచిలీపట్నం, విజయవాడ-ఒంగోలు తదితర పట్టణాల మధ్య రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైళ్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వ సూచించింది. ఇక హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ రైల్వే శాఖ రద్దు చేసే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు ఉప్పొంగడం.. పలుచోట్ల పట్టాలపైకి వరద పారుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter