అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల ఏర్పాటుకు లైన్ క్లియర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడాన్ని టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) తీవ్రంగా ఖండించారు. దీనిని ఓ చారిత్రక తప్పిదంగా అభివర్ణించిన చంద్రబాబు.. అమరావతి లాంటి ప్రాజెక్టుని చంపేస్తుంటే ఒక్కోసారి కన్నీళ్లు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: BJP in AP: రాజధాని విషయంలో బీజేపి వైఖరి ఇదే


రాజధాని వికేంద్రీకరణపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అమరావతిని తాను అనుభవించడానికి రాజధానిగా నిర్మించలేదని అన్నారు. ''మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని.. 40 ఏళ్లకుపైగా రాజకీయ జీవితం చూసిన నేను ఇంకా ఏదో అనుభవించాలని కోరుకోవడం లేదని అన్నారు. ఆరోగ్యం బాగుంటే మరో పదేళ్లు ఎక్కువ బతికుంటానేమో. అటువంటి నేను రాజధానిగా అమరావతిని నాకోసం నిర్మించలేదు కదా అని ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ సైతం ఆమోదం ఇవ్వడం అనేది ఇవాళ బ్లాక్ డేతో సమానం అని.. ఆలస్యంగానైనా సరే ఏదో రోజు అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. Also read: AP: రాజధాని రైతుల వ్యవహారం కాదు..ప్రజల హక్కు