అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ( Amit Shah ) ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఫోన్ చేసి పరామర్శించారు. బుధవారం అమిత్‌ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు.. అమిత్‌షా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఆగస్టు 2న అమిత్ షా కరోనాకు కరోనా సోకినట్టు కొవిడ్-19 పరీక్షల్లో తేలిన సంగతి తెలిసిందే. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ( Medantha hospital ) చేరి చికిత్స పొందిన అనంతరం ఆగస్టు 14న జరిపిన కరోనా పరీక్షల్లో నెటిగివ్ అని తేలడంతో అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. Also read : PM CARES Fund: ఐదు రోజుల్లోనే రూ. 3,076 కోట్లు


ఇంట్లో ఐసోలేట్ అవుతున్న క్రమంలోనే మరోసారి అనారోగ్యం బారిన పడటంతో ఆగస్టు 18న అమిత్‌ షా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఆగస్టు 31న ఆయన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. Also read : Hyderabad metro rail: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలు.. తెలుసుకోవాల్సిన విషయాలు