Chandrababu Naidu on Vangaveeti Radha issue: ఇటీవల వంగవీటి రంగా వర్ధంతి రోజున ఆయన తనయుడు వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తన హత్యకు కుట్ర జరుగుతోందన్న రాధా వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాధా హత్యకు కుట్రపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. రాధా హత్యకు రెక్కీ నిర్వహించినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు, వంగవీటి రాధాకు ఏం జరిగినా అందుకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని... బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో రాధాను టార్గెట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. హింసాత్మక సంఘటనలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా హత్యలకు రెక్కీ నిర్వహించే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నేరాలపై సమగ్ర విచారణ జరిపి దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని... అప్పుడే ప్రజల ప్రాథమిక హక్కులకు భద్రత ఉంటుందని అన్నారు.


ఇటీవల వంగావీటి రంగా వర్ధంతి సందర్భంగా రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని.. అందుకు రెక్కీ కూడా నిర్వహించారని రాధా వ్యాఖ్యానించారు. త్వరలోనే వారెవరో బయటపెడుతానని పేర్కొన్నారు. రాధా ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడే ఉన్నారు.


రాధా వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆయనకు 2+2 గన్‌మెన్ భద్రతను కల్పించింది. అయితే గన్‌మెన్లను రాధా (Vangaveeti Radha) తిప్పి పంపించారు. నిత్యం ప్రజల్లో ఉండే తనకు... తన అభిమానులే రక్షణ అని అన్నారు. అన్ని పార్టీల నుంచి తన శ్రేయస్సు కోరుతూ ఫోన్లు వస్తున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు సైతం రాధాను ఫోన్‌లో పలకరించారు. రెక్కీ విషయం అడిగి తెలుసుకుని... జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


Also Read: Roja Shocking Comments in Nani: "నాని నువ్వు కిరాణాకొట్టే పెట్టుకో.. సినిమాలు వేస్ట్.." యంగ్ హీరోపై రోజా సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook