Chandrababu Cabinet: 25 మందితో చంద్రబాబు కొత్త కేబినెట్ ఇదే, సీనియర్లకు మొండిచేయి
Chandrababu Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 25మందితో కేబినెట్ సిద్ధమైంది. అర్ధరాత్రి దాటిన తరువాత విడుదలైన జాబితాలో సీనియర్లు చాలామందికి మొండిచేయి లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Cabinet: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 25 మందితో కూడిన పూర్తి కేబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేయనుంది. చంద్రబాబు కేబినెట్‌లో చాలామందికి నిరాశే మిగిలింది.
నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత విడుదలైన కేబినెట్‌లో అంచనాలకు భిన్నమైన ఎంపిక కన్పించింది. 25 మందితో పూర్తి కేబినెట్ ప్రకటించడంతో ఆశావహులందరికీ షాక్ తగిలింది. జనసేనకు మూడు, బీజేపీకు 1 మంత్రి పదవి లభించాయి. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు అవకాశం లభించింది. బీజేపీ నుంచి సత్యకుమార్ కేబినెట్‌లో చోటు సంపాదించుకున్నారు.
చంద్రబాబు కొత్త కేబినెట్ ఇదే
1. నారా చంద్రబాబు నాయుడు
2. కొణిదెల పవన్ కళ్యాణ్
3. కింజరాపు అచ్చెన్నాయుడు
4. కొల్లు రవీంద్ర
5. నాదెండ్ల మనోహర్
6. పి.నారాయణ
7. వంగలపూడి అనిత
8. సత్యకుమార్ యాదవ్
9. నిమ్మల రామానాయుడు
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్
11. ఆనం రామనారాయణరెడ్డి
12. పయ్యావుల కేశవ్
13. అనగాని సత్యప్రసాద్
14. కొలుసు పార్థసారధి
15. డోలా బాలవీరాంజనేయస్వామి
16. గొట్టిపాటి రవి
17. కందుల దుర్గేష్
18. గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్థన్ రెడ్డి
20. టీజీ భరత్
21. ఎస్.సవిత
22. వాసంశెట్టి సుభాష్
23. కొండపల్లి శ్రీనివాస్
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
25. నారా లోకేష్
మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న గంటా శ్రీనివాసరావు, బొండా ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణం రాజు వంటి నేతలకు తీవ్ర నిరాశే మిగిలింది. ఇది పూర్తి స్థాయి కేబినెట్ కావడంతో కేబినెట్ విస్తరణ ఉండదు. అయితే పూర్తిగా ఐదేళ్లు ఇదే కేబినెట్ ఉంటుందా లేక మధ్యలో మూడేళ్లకు మారుస్తారా అనేది చూడాలి.
Also read: Chandrababu naidu: వైఎస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసిన చంద్ర బాబు.. అందుబాటులో రాని వైసీపీ అధినేత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook