Chandrababu Marriage Day: రాజకీయాల్లో చంద్రబాబుని అంతా అపర చాణుక్యుడిగా పిలుస్తారు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో సమర్ధుడిగా భావిస్తారు. ఏనాడూ కోర్టు మెట్లెక్కని చంద్రబాబు..ఇప్పుుడు తన పెళ్లి రోజున కోర్టు ప్రాంగణంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ 10. చంద్రబాబు జీవితంలో మర్చిపోలేని రోజు.  దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో వివాహమైన రోజు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజకీయ జీవితం సాగేందుకు కారణమైన ఘట్టం ఇదే. ఇవాళ రెండవ ముఖ్యమైన రోజు. ఏనాడూ కోర్టు మెట్లెక్కని చంద్రబాబు తన పెళ్లి రోజుని ఇలా కోర్డు ఆవరణలో..ఆరెస్టు అయి విచారణ ఎదుర్కోవల్సి వస్తుందని ఊహించి ఉండరు. 


చంద్రబాబు పెళ్లి రోజు సెప్టెంబర్ 10కు ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 9న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబుని నంద్యాలలో అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. అంటే చంద్రబాబు పెళ్లి రోజు కోర్టు కచేరీతో మొదలైంది. ఉదయం 4 గంటల్నించే వైద్య పరీక్షలు, సిట్ ఆఫీసులో హాజరు, కోర్టుకు తీసుకురావడం వంటి ప్రక్రియ ప్రారంభమైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్నారు. అది కూడా తన పెళ్లిరోజున కావడం గమనార్హం. ఇవాళ్టికి చంద్రబాబు, భువనేశ్వరి పెళ్లికి 42 ఏళ్లు పూర్తయ్యాయి. 


పెళ్లి రోజున చంద్రబాబుని ఇలా వేధించడంపై టీడీపీ శ్రేణులు, అభిమానులు మండిపడుతున్నారు. చంద్రబాబుకు మానసిక ప్రశాంతత లేకుండా చేయాలనేదే ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహమని టీడీపీ అభిమానులు విమర్శిస్తున్నారు. అంతా వ్యూహం ప్రకారమే సరిగ్గా చంద్రబాబు పెళ్లిరోజుకు ఒక రోజు ముందు అరెస్టు చేశారంటున్నారు. పెళ్లి రోజుని దృష్టిలో ఉంచుకునే విచారణ పేరుతో రాత్రంతా చంద్రబాబుని వేధించారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ కూడా జైళ్లోనే తన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్నారని..అందుకు ప్రతీకారంగానే ఇలా చేస్తున్నారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. మరి కొందరైతే చంద్రబాబుకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన పెళ్లిరోజు కానుకంటున్నారు. 


Also read: Chandrababu Case Updates: అది నా నిర్ణయంకాదు, ప్రభుత్వ నిర్ణయం, కోర్టులో స్వయంగా వాదన విన్పించిన చంద్రబాబు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook