విజయవాడ నగరానికి ఆవలి ఉన్న మరో 45 గ్రామాలను ఆ జిల్లా నగరపాలకసంస్థలోకి విలీనం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇటీవలే విజయవాడ, గన్నవరం పరిధిలో తనిఖీలు నిర్వహించిన ఆయన ఈ విషయమై అధికారులతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవే 


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    విజయవాడ నగరంలో కొండలపైన, రోడ్డు పక్క ప్రాంతాలలోనూ నివసిస్తున్న దాదాపు 50 వేల కుటుంబాలను ఆదుకోనున్నట్లు, వారికి ఇళ్ళ పట్టాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వాంబే కాలనీలో వీరికి ఇళ్ళు కేటాయించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు


  • అలాగే పాత బస్టాండు దగ్గర ఉన్న సీఎన్జీ డీపోను, పండిట్ నెహ్రు బస్ స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. 


  • నగరంలో గ్యాస్ పైప్ లైన్ వేయడం కోసం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను సంప్రదించాల్సి ఉందని చెప్పారు.


  • విజయవాడకి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చే యోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు. 


  • విజయవాడ నగరంలో సుందరీకరణ జరగాలంటే కాల్వల పక్కన చెత్త కనబడకూడదని, రహదారులు పక్కన పూల చెట్లు పెంచే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే జపనీస్ పగోడా రకం చెట్లను పెంచాలని కూడా చెప్పారు.  


  • విజయవాడ కనకదుర్గమ్మ ఆవాసమైన ఇంద్రకీలాద్రిపై ఎరుపు, పసుపు రంగు పుష్పవాటికలను ఏర్పాటు చేయాలని, ఇటువంటి కొత్త ఆలోచనల వల్లే పర్యాటకంగా మనం ముందుకు వెళ్లగలమని , ప్రస్తుతం పుష్పవాటికల నిర్మాణ బాధ్యతను అర్మన్ గ్రీనరీ ప్రాజెక్టు అధికారులకు ఇస్తున్నామని అన్నారు. 


  • దుర్గమ్మ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులకు తెలిపారు.