Telugu Desam Party: వర్షాలు.. వరదలతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జరగాల్సిన సంబరాలు, వేడుకలు.. సహాయ కార్యక్రమాలను రద్దు చేసుకుంది. పార్టీకి కీలకమైన వేడుకలను రద్దు చేయడంతో తెలుగు తమ్ముళ్లు నిరాశకు లోనయ్యారు. సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వేళ పార్టీ పిలుపునివ్వడంతో నిరాశకు గురయ్యారు. ఇంతకీ ఆ సంబరాలు ఏమిటో తెలుసా?

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు బిజీబిజీ.. భారీ వర్షాలతో రాత్రి నిద్రపోకుండా సమీక్ష


 


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. అయితే మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి అయిన తేదీ సెప్టెంబర్ 1వ తేదీ. ఈ సంవత్సరానికి 30 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక దినాన్ని సంబరాలు చేసుకోవాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. సంబరాలు చేసుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. అయితే రెండు రోజులు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి మారిపోయింది.

Also Read: Tragedy Incident: టీచర్స్‌ డే ముందే విషాదం.. విద్యార్థుల ప్రాణాలు కాపాడుతూ టీచర్‌ జల సమాధి


 


బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు, చెరువులు ప్రమాదకరంగా ప్రవహిస్తూ వరదలు తలెత్తాయి. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంతో రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా 30 సంవత్సరాలు పూర్తయిన సంబరాలు చేసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు టీడీపీ ముఖ్యమైన ప్రకటన చేసింది. వేడుకలు చేసుకోవద్దని సూచించింది.


*తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ముఖ్య గమనిక. నారా చంద్రబాబు నాయుడు  మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి అయ్యి సెప్టెంబర్ 1వ తేదీకి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మీ నియోజకవర్గంలో ఎక్కడా కూడా సంబరాలు వద్దు. కేక్ కటింగ్‌లు చేయరాదు. బాణాసంచాలు కాల్చవద్దు. భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  సంబరాలు వద్దని నిర్ణయించారు' అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. సంబరాలు చేసుకోవద్దని చెప్పడంతో పార్టీ శ్రేణులు నిరాశకు లోనయ్యారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.