CID Case On CBN, Lokesh: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భూహక్కు చట్టంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయి. అయితే అసత్య ప్రచారం చేస్తున్నారని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కొట్టిపారేస్తున్నా వినిపించుకోకపోవడం లేదు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు ఇచ్చింది. ఫిర్యాదును స్వీకరించి వెంటనే సీఐడీకి విచారణ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబును ఏ 1గా, లోకేశ్‌ను ఏ 2గా చేర్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ambati Rambabu: మా మామకు ఎవరూ ఓటేయొద్దు.. అంబటి రాంబాబు అల్లుడు ఓటర్లకు పిలుపు


 


ప్రజల భూములను ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లాగేసుకుంటున్నారని టీడీపీ, జనసేన కూటమి విమర్శిస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ తమ ప్రచార కార్యక్రమాల్లో ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు. అయినా కూడా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తుండడంతో వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ వినియోగిస్తూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. 

Also Read: Pothina Mahesh: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ పెళ్లాలు ప్రచారం చేయరా? ఛీ నా బతుకు చెడ


 


ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై జరుగుతున్న ఫేక్ ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. చంద్రబాబు, లోకేశ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారా లోకేశ్ పేర్లను చేర్చింది. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈసీ ఆదేశాలతో సీఐడీ విచారణ ప్రారంభించింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తోపై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిందెవరో తేల్చే పనిలో సీఐడీ చర్యలు చేపట్టింది.


త్వరలోనే చంద్రబాబు, లోకేశ్‌కు నోటీసులు పంపే అవకాశం ఉంది. పోలింగ్‌ లోపే సీఐడీ సహాయంతో ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి కుంభకోణం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసిని విషయం తెలిసిందే. మరోసారి సీఐడీ కేసు నమోదు చేయడం టీడీపీతోపాటు జనసేనలో కలకలం ఏర్పడింది. తండ్రీకొడుకులపై సీఐడీ, ఈసీ కఠిన చర్యలు తీసుకుంటే మాత్రం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter