ప్చ్..హోలీ పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లో వినోదం కరవు
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ సినిమా థియేటర్ల మూత బడ్డాయి. డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ర్టాల సినిమా నిర్మాతల మండలి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు నుంచి ( మార్చి 2న) బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో సహా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో థియేటర్ యాజమాన్యాలు చిత్ర ప్రదర్శన నిలిపివేశారు.
ప్చ్.. హోలీ రోజు బోర్
ప్రతి ఏటా హోలీ పర్వదినాన సినిమా థియేటర్లలో సందడి వాతావరణం కనిపించేది..అయితే ఈ సారి అలాంటి అహ్లాదకరమైన వాతావారణం కనుమగైంది. జనాలు లేక సినీ థియేటర్లు బోసిపోతున్నాయి. సినీ థియేటర్లు మూతబడటంతో జనాలకు ఎంటర్‌టైన్‌మెంట్ లేక తెగ బోర్ ఫీలౌతున్నారు.
కార్మికులకు ఇక్కట్లు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 2 వేల 500 సినిమా థియేటర్లు ఉన్నాయి. వాటిలో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీనికి తోడు థియేటర్ల పై ఆధారపడే చిరు వ్యాపారులు వేల సంఖ్యలో ఉన్నారు. రోజు కూలి చేస్తే కానీ వారికి పూటగడవదు. బంద్ ప్రభావంతో ఆ కార్మికులకు తీవ్ర ఇబ్బుందులు ఎదుర్కొంటున్నారు.