ఏపీ సీఎం చంద్రబాబు ఆశా వర్కర్లకు తీరు కబురు చెప్పారు. ప్రతిభ ఆధారిత పారితోషిక గరిష్ఠ మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. తాజా పెంపుతో గౌవర వేతనంతో కలిపి 8 వేల 600 వరకు వస్తుంది.  ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆశా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  తమిళనాడు, కర్నాటక సహా ఎవరూ ఆశా వర్కర్లకు ఇంత మొత్తం ఇవ్వడం లేదని.. దేశంలో ఎవరూ ఇవ్వనంతగా తమ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇంత మొత్తాన్ని ఇస్తుందన్నారు. అదే సందర్భంలో ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు


ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆశా వర్కర్లకు ప్రతి నెల గౌరవ వేతనం కింద రూ.3 వేలతొ తో పాటు ప్రతిభ ఆధారిత పారితోషికంగా వారి పని తీరు ఆధారం చేసుకొని మరో మూడు వేల రూపాయలు ఇస్తున్నారు. ఇలా రెండు కలిపి రూ.6 వేలు మాత్రమే ఆశా వర్కర్లకు సమకూరుతుంది. తాజా నిర్ణయంతో గౌరవ వేతనంతో కలిసి ప్రతిభ ఆధారిత పారితోషికం రూ.8 వేల 600కు పెరగనుంది. ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రకటనపై ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు