ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్ కసరత్తు !!
ప్రస్తుతం కార్పోరేషన్ పరిధి ఉన్న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎదురయ్యే అంశంపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేస్తున్నారు
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో సంబంధిత శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆర్టీసీ ప్రభుత్వ విలీనంపై కమిటీ రిపోర్టు ఆధారంగా చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం విలీనం చేసేందుకు అనుసరించాల్సి విధివిధానాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ నిర్వహణ నుంచి కార్మికుల సమస్యల వరకు ఆయా అంశాలపై ఎలాంటి పద్దతులు అవలంభించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు . ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యమేనా ?..విలీనం చేస్తే ఎదురయ్యే ఇబ్బందులేంటి అనే దానిపై జగన్ కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం కార్పోరేషన్ పరిధి ఉన్న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎదురయ్యే అంశంపై సీఎం సమక్షంలో అధికారయంత్రాంగం కసరత్తు చేస్తోంది. ట్రేడ్ యునియన్ల ప్రాధాన్యం, ప్రస్తుత బోర్డు రద్దు, భవిష్యత్తు ప్రైవేటు భాగస్వామ్యం పెంపు, ప్రస్తుత అద్దె బస్సుల పెంపు, ఇతర రాష్ట్రాల్లో ఎదురౌతున్న అనుభవాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు