CM Jagan: నా వెంట్రుక కూడా పీకలేరు... నంద్యాల సభలో చంద్రబాబు, పవన్‌లపై నిప్పులు చెరిగిన సీఎం జగన్...
CM Jagan Speech in Nandyala Public Meeting: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఫైర్ అయ్యారు.
CM Jagan Speech in Nandyala Public Meeting: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు ఉంటాయని... అయితే రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలు కలుస్తాయని అన్నారు. పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు సైతం రాష్ట్ర ప్రతిష్ఠ గురించి గొప్పగా చెబుతాయన్నారు. కానీ ఏపీలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. 'మనకిక్కడ దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండటం మన రాష్ట్రం కర్మ.' అని చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి జగన్ విమర్శించారు. నంద్యాలలో జరిగిన 'జగనన్న వసతి దీవెన' రెండో విడత నిధుల విడుదల కార్యక్రమ సభలో సీఎం జగన్ మాట్లాడారు.
రాష్ట్రంలో ఎన్ని సమస్యలు, కష్టాలు ఉన్నా... అవేవీ తనను కదిలించలేవని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, దేవుడి దయతో జగన్ అనే నేను ఈ స్థానానికి వచ్చానన్నారు. దేవుని దయ, ప్రజా దీవెనలు ఉన్నంతవరకూ వాళ్లెవరూ నా వెంట్రుక కూడా పీకలేరని చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి మండిపడ్డారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో గోరుముద్ద పేరిట రూ.500 కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రూ.1900 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. భోజనం తర్వాత పిల్లలకు పల్లిపట్టీ కూడా అందిస్తున్నామని... అయితే దానిపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడుపు మంటకు, అసూయకు మందు లేదని చంద్రబాబును ఉద్దేశించి జగన్ పేర్కొన్నారు. అసూయ, కడుపు మంట ఎక్కువైతే బీపీ పెరుగుతుందని.. గుండెపోటు వచ్చి టికెట్ కొంటారని ఎద్దేవా చేస్తారు. కాబట్టి ఇకనైనా అసూయ తగ్గించుకోకపోతే ఆరోగ్యానికి చేటు అని సూచించారు.
కాగా, జగనన్న వసతి దీవెన పథకం రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో ఇవాళ రూ.1024 కోట్లు జమ చేశారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అసలైన ఆస్తి చదువేనని... చదువుతోనే బతుకులు మారుతాయని అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. అందరినీ చదివించాలని... అందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. పేదరికం కారణంగా పిల్లల చదువులు ఆగిపోవద్దని... చదువును తల్లిదండ్రులు ఆర్థిక భారంగా భావించకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
Also Read: Cardless withdrawal: కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా: ఆర్బీఐ
Also Read: Yuzvendra Chahal: ఆ క్రికెటర్ ఫుల్‌గా తాగి.. 15వ అంతస్థు నుంచి నన్ను తోసేయబోయాడు: చహల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook