CM Jagan: అంత అసూయపడితే త్వరగా టికెట్ తీసుకుంటారు.. మంచి చేస్తే శ్రీలంక, వెన్నుపోటు పొడిస్తే అమెరికానా..!

CM Jagan Satires and Counters on CBN and Pawan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఫైర్ అయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 06:45 PM IST
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై సీఎం జగన్ సెటైర్స్ ,కౌంటర్స్
  • ఏపీ మరో శ్రీలంక అవుతుందని దుష్రప్రచారం చేస్తున్నారంటూ ఫైర్
  • అసూయ పడితే త్వరగా టికెట్ తీసుకుంటారని సెటైర్
CM Jagan: అంత అసూయపడితే త్వరగా టికెట్ తీసుకుంటారు.. మంచి చేస్తే శ్రీలంక, వెన్నుపోటు పొడిస్తే అమెరికానా..!

CM Jagan Satires and Counters on CBN and Pawan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తోంటే... ఏపీ మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 'పేదలకు సంక్షేమ పథకాలు అమలుచేస్తే శ్రీలంక అవుతుందట... ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అమెరికా అవుతుందట... మంచి చేస్తే శ్రీలంక... వెన్నుపోటు పొడిస్తే అమెరికా...' అంటూ చంద్రబాబుకు జగన్ చురకలంటించారు. గురువారం (ఏప్రిల్ 7) నరసారావుపేటలో జరిగిన వాలంటీర్లకు వందనం సభలో జగన్ మాట్లాడారు. 

వైసీపీ పాలన ఇలాగే సాగితే ఇక తమకు డిపాజిట్లు దక్కవనే బాధ, ఏడుపు చంద్రబాబుతో పాటు ఆయన పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అందుకే అంతా కలిసి వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఏపీ మరో శ్రీలంక అవుతుందనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోని ఈ దొంగల ముఠా... రాష్ట్ర ఖజానాను గతంలో దోచుకున్న ఈ దొంగల ముఠా... ఎన్నికలప్పుడు పచ్చి అబద్దాలు చెప్పిన ఈ దొంగల ముఠా... ఎన్నికల తర్వాత పత్తా లేకుండా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఈ దొంగల ముఠా.. భవిష్యత్తులో తమకు ఏ ఒక్కరు ఓటేయరనే భయంతోనే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

తన ఢిల్లీ పర్యటనపై కూడా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించేందుకు తాను ఢిల్లీకి వెళ్లానని... దాదాపుగా గంటకు పైగా మంచి వాతావరణంలో ప్రధానితో భేటీ జరిగిందన్నారు. దాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు.. మోదీ జగన్‌కు క్లాస్ పీకారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీతో భేటీ సమయంలో తామిద్దరమే లోపల ఉన్నామని... కొంపదీసి మీరు మోదీ సోఫా కిందనో, లేక నా సోఫా కిందనో ఉన్నారా అని చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాను ఉద్దేశించి విమర్శించారు. అంతేకాదు, తమ ప్రభుత్వంపై ఇంత అసూయ పనికిరాదని... అసూయకు మందు లేదని... అంత అసూయపడితే త్వరగా గుండెపోట్లు వచ్చి టికెట్ తీసుకుంటారని సెటైర్స్ వేశారు.

Also Read: Bandla Ganesh on Pawan Kalyan: మీకు తిరుగులేదు దేవర... పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేశ్ లేటెస్ట్ కామెంట్స్...

China: షాంఘై కపుల్స్‌కి చైనా హెచ్చరిక.. కలిసి పడుకోవద్దు.. ముద్దులు, కౌగిలింతలకు దూరంగా ఉండాలి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News