Super Star Krishna Funeral: ఒకే ఫ్రేమ్‌లో సీఎం జగన్, బాలయ్య.. సూపర్ స్టార్ కృష్ణకు నివాళి
CM Jagan And Balakrishna Pay Tributes To Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ ఒకే సమయంలో పద్మాలయ స్టూడియోలో ఉన్నారు.
CM Jagan And Balakrishna Pay Tributes To Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. పద్మాలయ స్టూడియోలో ఆయన భౌతికకాయం అభిమానుల సందర్శనార్థం ఉంచారు. వేలాది మంది తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
పద్మాలయ స్టూడియో కృష్ణ పార్థివదేహానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. మహేష్ బాబు, నమ్రతా, ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మహేష్ బాబును జగన్ ఓదార్చారు. ఈ సందర్భంలో నందమూరి బాలకృష్ణ కూడా అక్కడే ఉన్నారు. కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు కుటుంబ సభ్యులను పరిచయం చేసే సమయంలో బాలయ్య వెనుక నిల్చున్నారు. బాలకృష్ణను చూసిన సీఎం జగన్ వెంటనే నమస్కారం పెట్టారు. బాలయ్య కూడా తిరిగి నమస్కారం పెట్టారు. అందరితో మాట్లాడిన సీఎం జగన్.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అంతకుముందు బాలకృష్ణ మాట్లాడుతూ.. కృష్ణ సినిమాలు సాహసాలకు, ప్రయోగాలకు మారుపేరు అన్నారు. సినిమా రంగానికి ఆయన ఎన్నో సేవలు చేశారని.. చాలా కొత్త టెక్నికల్ అంశాలను తెలుగు తెరకు అందించారని గుర్తు చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా రాణించారని.. పద్మాలయ స్టూడియోను స్థాపించారని అన్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కృష్ణ చెరగని స్థానం దక్కించుకున్నారని కొనియాడారు. నిర్మాతల పాలిట కృష్ణ కల్ప తరువుగా నిలిచారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
ఆ మహానటుడు ఎన్టీఆర్, కష్ణ ఇద్దరు ఇండస్ట్రీకి బంగారు గుడ్లు పెట్టే బాతులు అని అన్నారు బాలయ్య. ఇద్దరు నిర్మాతలకు అండగా నిలిచారని.. ఆర్థికంగా సాయపడ్డారని కొనియాడారు. తాను కృష్ణతో కలిసి సుల్తాన్ సినిమా చేశానని.. ఆ సమయంలో ఎప్పుడు నాన్న గురించే చెప్పేవారేనని అన్నారు. కృష్ణ సేవలను గుర్తించి ఎన్నో అవార్డులను ఇచ్చారని.. ఆయన 350 సినిమాల్లోపైగా నటించారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులను జీవితంలో మర్చిపోలేమని.. కళామతల్లికి చేసిన సేవలు శాశ్వతమని బాలకృష్ణ కొనియాడారు.
Also Read: IPL 2023 Released Players: కాసుల వర్షం కురిపించి మొఖం చాటేశారు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి
Also Read: నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి సూర్యుడు.. రాబోయే 30 రోజులు ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook