Sun Transit In Scorpio on 2022 November 16: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. ఈ క్రమంలోనే 2022 నవంబర్ 16న సూర్యుడు తులా రాశిని వదిలి వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈరోజు రాత్రి 8.58 గంటలకు వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. బుధవారం (నవంబర్ 16) వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో.. కొన్ని రాశుల వారు ప్రయోజనాలు పొందుతారు. అదే సమయంలో మరికొన్ని రాశుల వారు అశుభ ఫలితాలు ఎదుర్కొంటారు. సూర్య సంచారం వలన ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి:
వృశ్చిక రాశిలోకి సూర్యుడి రాకతో మీన రాశిపై ప్రభావం ఉంటుంది. మీన రాశి వారు కొత్త ప్రదేశానికి ప్రయాణించాల్సి ఉంటుంది. కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. కంటి సమస్యలు రావొచ్చు. ప్రేమ వ్యవహారాలలో కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడేవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ధనుస్సు రాశి:
సూర్యుని సంచారం కారణంగా ధనుస్సు రాశి కొన్ని అశుభ ఫలితాలు పొందవచ్చు. ప్రేమ వ్యవహారాలలో అడ్డంకులు ఎదురవుతాయి. వివాహం పనులు ముందుకు సాగవు. ఉద్యోగస్తులు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీ యజమానిని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. 30 రోజుల పాటు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
మిథున రాశి:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మిథున రాశి వారికీ సూర్యుని సంచారము అనేక సవాళ్లను తెస్తుంది. మిథునంలోని ఆరవ ఇంట్లో సూర్యుని సంచారం జరగబోతోంది కాబట్టి.. వ్యాధి, శత్రువు మొదలైన వాటి నుంచి నెల రోజుల పాటు ముప్పు పొంచి ఉంది. మీ శత్రువులు చురుకుగా ఉంటారు. ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాల జోలికి పోవద్దు. సహనం కొనసాగించండి.
మేష రాశి:
ఈరోజు సాయంత్రం సూర్యుడు తన రాశిని మార్చి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్య సంచారం కారణంగా మేష రాశి వ్యక్తులు ఆకస్మిక ప్రమాదాలు గురికావాల్సి ఉంటుంది. కాబట్టి వాహనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొత్త కోర్సు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.. లేకుంటే భారీ నష్టాన్ని భరించాల్సి రావచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook