CM Jagan Mohan Reddy on AP Elections Results: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రిజల్ట్స్‌పై తొలిసారి రియాక్ట్ అయ్యారు. విజయవాడలో ఐప్యాక్ కార్యాలయన్ని సందర్శించిన జగన్.. అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. గతంతో పోలిస్తే ఈసారి మరిన్ని సీట్లు అధికంగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లకు మించి గెలుచుకోబోతున్నట్లు జోస్యం చెప్పారు. ఎనికల తర్వాత ఫస్ట్ టైం ఆయన ఐ ప్యాక్ టీమ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వచ్చే ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుందన్నారు. మరోసారి వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..


"మనమే రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నాం. 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతోంది. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన  గొప్ప పాలన అందిస్తాం.. ఐ ప్యాక్ టీమ్ చేసిన సేవలు వెలకట్టలేనిది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం." అని సీఎం జగన్ అన్నారు.


ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందంటూ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని అన్నారు. "ప్రశాంత్ కిషోర్ ఊహించలేని సీట్లు వస్తాయి. ఆయన చేసేందిమి లేదు. అంతా టీమ్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఐప్యాక్ ఎంతో సాయపడిందని.. ఐప్యాక్ సూచనలను గత 5 ఏళ్ల పాలనలోనూ అమలు చేశామని చెప్పారు. అన్ని రాష్ట్రాల నేతలు ఏపీనే చూస్తారన్నారు. రిజల్ట్స్ తరువాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. మన ప్రయాణం ఇలానే కొనసాగుతుంది.." అని ఐప్యాక్ టీమ్‌తో జగన్ చెప్పారు.


మే 13న ఏపీలో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదైంది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది ఆసక్తికరంగా మారింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షప్తమైంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.


Also Read: Oppo Pad Air 2: ఒప్పో నుంచి అతి శక్తివంతమైన ట్యాబ్‌ వస్తోంది.. టాప్‌ ఫీచర్స్‌ ఇవే!  


Also Read: SRH Vs GT Dream11 Team: నేడు గుజరాత్‌తో సన్‌రైజర్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ ఇలా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter