Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..

Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 16, 2024, 05:52 PM IST
Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..

Hyderabad Rains: హైదరాబాద్‌ మహా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఓ మోస్తరుగా ఉన్న ఒక్కసారిగా కారు మబ్బులతో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఉన్నట్టుండి పడిన వర్షంతో హైదరాబాద్ వాసులు తడిసి ముద్దయ్యారు. అంతేకాదు ఎండల నుంచి కాస్తంత ఉపశమనం పొందారు. ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో కీలమైన హైదరాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ మధ్య మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే కదా.  వర్షం నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఒకింత నిరాశకు గురవుతున్నారు. ఇంకోవైపు హైదరాబాద్‌లో మరో 5 రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.

బుధవారం తుర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం, గురువారం మధ్యప్రదేశ్‌లోని నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో రాగల 5 రోజుల్లో తెలంగాణతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గురువారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ,సూర్యాపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, వనపర్తి , జోగులాంబ గద్వాల, నారాయణ పేట జిల్లాల్లో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్లో వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.

Also read: Mamata Banerjee: మరో బాంబ్‌ పేల్చిన మమతా బెనర్జీ.. ఇండియా కూటమికి రాం రాం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News