
Oppo Pad Air 2: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. చైనాలో తర్వాలోనే Oppo Reno 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అలాగే కంపెనీ ఈ మొబైల్స్‌కి సంబంధించిన తేదిని కూడా అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్‌ను మే 23లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. దీంతో పాటు కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఒప్పో ఎయిర్ 4 ప్రోని కూడా లాంచ్ చేయబోతోంది. దీంతో పాటు Enco R3 అనే కొత్త ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేయబోతోది. అయితే ఈ పరికరాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo Pad Air 2 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
Oppo ప్యాడ్ ఎయిర్ 2 ట్యాబ్‌ను కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ అరోరా పర్పుల్‌తో పాటు లేత ఊదా రంగుల్లో అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈ ప్యాడ్ ఎయిర్ 2 మొదట స్పేస్ గ్రే, స్ట్రీమర్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో విడుదల చేయబోతున్నట్లు ఒప్పో వెల్లడించింది. ఈ ట్యాబ్ 2.4K రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని డిప్లే LCD ప్యానెల్‌తో వచ్చింది. అలాగే పొడవైన 11.35-అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంటుంది. దీంతో పాటు MediaTek Helio G99 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
డాల్బీ అట్మాస్ సౌండ్:
ఈ Oppo Pad Air 2 స్మార్ట్‌ట్యాబ్ అతి శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవలే కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఇది పెద్ద 8000mAh బ్యాటరీ సెటప్‌తో రాబోతోంది. దీంతో పాటు 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఈ ట్యాబ్ బ్యాక్ సెటప్‌లో ప్రత్యేకమైన రెండు కెమెరాలను కూడా అందిస్తోంది. ఇందులో ప్రధాన కెమెకా 8-మెగాపిక్సెల్‌తో రాబోతోంది. ఇది డాల్బీ అట్మాస్ సౌండ్‌తో క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్‌తో వస్తోంది. దీంతో పాటు అదనంగా మైక్రో SD కార్డ్ స్లాట్, 3.5 మిమీ ఆడియో జాక్, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ స్లాట్లను కలిగి ఉంటుంది.
Oppo Enco R3:
ఒప్పో కంపెనీ ట్యాబ్‌తో పాటు Enco R3 ఇయర్‌బడ్‌లను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతోంది. ఇది ETEC1 మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నాయి. అలాగే అల్ట్రా స్పేషియల్ సౌండ్, AI కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. అయితే కంపెనీ ఈ ఇయర్ బడ్స్‌కి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe