CM Jagan Lay Foundation For Food Processing Units and Industries: విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కార్యరూపం దాల్చాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా పరిశ్రమలు, ఆహారశుద్ధి రంగంలో మొత్తం 13 ప్రాజెక్టులకు  ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందులో 3 కంపెనీల ప్రారంభం, 9 ప్రాజెక్టులకు శంకుస్ధాపన, ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఎంఓయూ పూర్తయింది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు దాదాపుగా 13 యూనిట్లకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నామన్నారు. ఇందులో ఒకటి ఎంఓయూ కూడా ఉందని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లో భాగంగా విశాఖపట్నంలో ఆ రోజు పరిశ్రమలు నెలకొల్పేందుకు.. దాదాపు 386 ఎంఓయూలు, రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు, దానిద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అవన్నీ సాకారం కావాలని.. ప్రతినెలా వాటిని కార్యరూపం దాల్చేలా.. అవి అమలు కావాలన్న ఉద్ధేశ్యంతో సీఎస్‌  ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఏర్పాటు చేసి.. పారిశ్రామిక వేత్తలను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగా భావించి.. పారిశ్రామిక వేత్తలను చేయిపట్టుకుని నడిపించి ఆఎంఓయూలను కార్యరూపం దాల్చే విధంగా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇటువంటి పరిశ్రమలకు సంబంధించిన 13 శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. 


ఇందులో 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్ధాపన చేస్తున్నాం. ఒక ఎంఓయూపై సంతకాలు కూడా చేశాం. దాదాపుగా రూ.3008 కోట్ల పెట్టుబడితో దాదాపు 7 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే బృహత్తర కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. 14 జిల్లాల్లో వస్తున్న ఈ పరిశ్రమల వల్ల సుమారు 7 వేల మందికి  పైగా అక్కడ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 75 శాతం స్ధానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల.. స్ధానికులందరూ ఈ పరిశ్రమల ఏర్పాటుకు మద్ధతు పలికి, స్వాగతించే విధంగా మనం ఈ చట్టం చేశాం. 


వీటివల్ల ఈ పిల్లలకు ఆరు నెలల నుంచి గరిష్టంగా 18 నెలలులోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు కూడా రానున్నాయి. అప్పటిలోగా ఈ పరిశ్రమలు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి.  ఇందులో 3 యూనిట్లు ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలిన 9 శంకుస్ధాపన చేశాం. ఇవన్నీ కూడా ఆరునెలల నుంచి ఏడాదిన్నరలోనే పూర్తవుతాయి. ఇవాళ ఎంఓయూ చేసుకున్న ప్లాంట్‌ కూడా ఏడాదిన్నర లోగా అందుబాటులోకి రానుంది. ఈ రోజు జరిగిన అన్ని కార్యక్రమాల వల్ల అందరి యాజమాన్యాలకు, ఉద్యోగులు అందరికీ మనసారా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను." అని సీఎం జగన్ అన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా.. మేం మీకు ఒక ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉన్నామన్నారు.  


Also Read: MP Bandi Sanjay: ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్


Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook