MP Bandi Sanjay: ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్

Bandi Sanjay On KTR: మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ మోసగాళ్ల పార్టీ అని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ పాపాలు పండినయ్ కాబట్టే ప్రధాని మోదీ బయటపెట్టారని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 4, 2023, 08:49 AM IST
MP Bandi Sanjay: ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్

Bandi Sanjay On KTR: "మిస్టర్ అజయ్ రావు అలియాస్ ట్విట్టర్ టిల్లు... మోదీ గారు వాస్తవాలు చెబితే అంత ఉలుకెందుకు..? ప్రధాని స్థాయిని మరిచి నీచంగా మాట్లాడతవా..? నేను సవాల్ చేస్తున్నా.. మోదీ గారు చెప్పింది తప్పని నిరూపిస్తవా..? నీకు చేతనైతే.. మీ అయ్య నిజమైన, నిఖార్సైన హిందువని భావిస్తే... పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా..?" అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఏ పిచ్చి కుక్క కరిచిందని కేసీఆర్ 2009 ఎన్నికల ఫలితాలు కూడా వెలువడకముందే ఎన్డీఏతో జతకట్టేందుకు సిద్ధమయ్యారో ట్విట్టర్ టిల్లు చెప్పాలని ఎద్దేవా చేశారు. ప్రధానిపై అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలే మిమ్ముల్ని పిచ్చికుక్కల్లా తరిమి కొడతారని హెచ్చరించారు. నిజామాబాద్ సభ ముగిసిన అనంతరం కరీంనగర్ వెళుతున్న బండి సంజయ్ మార్గమధ్యలో జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. 

ఇంత మంచి పని చేస్తుంటే కల్వకుంట్ల కుటుంబానికి మైండ్ దొబ్బిందంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్. కండ కావరమెక్కి మాట్లాడుతున్నారని.. మంత్రులను ఎగదోసి మోదీని తిట్టిస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ జరిగిన వాస్తవాలు చెప్పడం తప్పా..? అని ప్రశ్నించారు. ఎన్డీఏ 38 పార్టీల కూటమి అని.. బీఆర్ఎస్ పార్టీది ఏ కూటమి..? అని అడిగారు. బీఆర్ఎస్ మోసగాళ్ల పార్టీ అని.. దుబాయ్ చంద్రశేఖర్ రావు నుంచి నేటి అజయ్ రావు వరకు అంతా మోసమేనని విమర్శించారు. 

"మంత్రి పదవి కోసం ఏకంగా నీ పేరునే మార్చిన చరిత్ర మీ అయ్యది. అసలు తెర వెనుక ఏం జరిగిందో ఒక్కసారి వెళ్లి మీ అయ్యను అడుగు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు, బీజేపీకి 5 వేల ఓట్లే తేడా. ఆ తరువాత మీ అయ్య పోయి ఏం చేసిండో అడుగు. దుబ్బాక ఎన్నికల్లో, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంచి ఏం చేశారు మీరు.. మునుగోడులో వందల కోట్లు ఖర్చు చేసి ఏం చేశారు..? మహా అంటే బోటా బోటీ మెజారిటీతో గెలిచారంతే...

మోదీగారు ఇప్పుడే ఎందుకు బయటపెట్టారనుకుంటున్నావా..? శిశుపాలుడి లెక్క మీరు నూరు తప్పులు చేశారు. మీ పాపాలు పండినయ్ కాబట్టే బయటపెట్టారు. మీ కుటుంబమే పెద్ద మోసకారి కుటుంబం. దోచుకోవడమే మీ పని. తెలంగాణ అంటే మీ నలుగురే. నెంబర్ వన్ చీటర్స్ కుటుంబం. మోదీ గారిని చీటర్ అంటవా..? మీ అయ్య నెంబర్ వన్ చీటర్. దొంగ దీక్ష చేసి రాత్రంతా మందు తాగి పండి మీడియా ఎదుట నటించిన మూర్ఖుడు.  మీ అయ్య సీఎం అయ్యారంటే.. బీజేపీ పెట్టిన భిక్ష. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే రాకుండా తాగి పడుకుని దొంగ సంతకాలు చేసిన చీటర్ మీ అయ్య. సూటు బూటు వేసుకుని ఏది పడితే అది మాట్లాడితే జనం నమ్ముతారనుకుంటున్నవా..?

తెలంగాణ ఉద్యమ సమయంలో ట్విట్టర్ టిల్లు బతుకేందో తెలుసా..? ముడతల షర్ట్, అరిగిపోయిన రబ్బర్ చెప్పులు వేసుకున్నోడు.. ఇయాళ వేల కోట్లు ఎట్లా సంపాదించినవ్..? మీ అయ్య ఏమైనా పాస్ పోర్టుల దందా చేసి వేల కోట్లు సంపాదించాడా..?" అంటూ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మోదీ వస్తే తట్టుకోలేకపోతున్నారని.. ఒక మంత్రేమో టీవీలు తంతున్నడని.. ఇంకోకరు ఫ్లెక్సీలు చింపుతున్నారని అన్నారు.

Also Read: Numerology Number Predictions Today: ఈ నంబరు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లక్కే లక్కు.. మీ దశ తిరిగినట్లే..!  

Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!     

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News