YS Jagan Mohan Reddy Meeting: విశాఖపట్నం జిల్లా విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన మంచి పనులను ఆయన గణాంకాలతో వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తొలిసారి పథకాలు సామాన్యుడి ఇంటి వద్దకు వెళుతున్నాయన్నారు. వివక్షకు ఏమాత్రం తావులేకుండా.. లంచాలకు ఆస్కారం లేకుండా పాలన సాగుతోందని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98 శాతంపైగా హామీలను నెరవేర్చామని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత ప్రజలకు దగ్గరకు వెళ్లి వాళ్ల ఆశీస్సులు కోరుతున్నామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా 175కు 175 నియోజకవర్గాలు ఎందుకు రాకూడదు అన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేయాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితిలు గుర్తుచేయడానికే ఈ సమావేశం నిర్వహించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.  


 175కు 175 అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధ్యమవుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలాంటి నియోజకవర్గంలో కూడా క్లీన్‌ స్వీప్‌ చేశామని.. మున్సిపాల్టీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాలు కూడా  అన్నీ అలానే గెల్చుకున్నామని గుర్తు చేశారు. గతంలో రాని ఫలితాలు ఇవాళ చూస్తున్నామని.. ప్రతి ఇంటిలో కూడా సంక్షేమం, అభివృద్ధి అన్నది కనిపిస్తోందన్నారు. పారదర్శకంగా పథకాలు అమలవుతున్నాయన్నారు. 


'మనం ఎందుకు ఈ సమావేశా నిర్వహిస్తున్నామంటే.. మనం కలిసి చాలా రోజులైంది. కలిసినట్టు ఉంటుంది. ఇది మొదటి కారణమైతే.. రెండో కారణం మనం గడప గడపకూ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ప్రతి వార్డులోకి, ప్రతి ఇంటిదగ్గరకి తీసుకుపోతున్నాం.. ఇందులో మీ అందరి భాగస్వామ్యం ఎంతో అవసరం. విశాఖపట్నం రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరం. ఈ నగరంలో ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా 76 శాతం ఇళ్లల్లో మన పథకాలు కనిపిస్తున్నాయి. దాదాపు 1.05 లక్షల ఇళ్లు ఉంటే దాదాపు 80 వేల ఇళ్లకు పథకాలు అందాయి. అంత పారదర్శకత కనిపిస్తోంది. 


ఇటువంటి ఈ పరిస్థితుల్లో మనమంతా ఆలోచన చేయాలి. ఎందుకు 175కి 175 సాధ్యం కాదు. ఇది కావాలంటే రెండు జరగాలి. ఒకటి నేను చేయాల్సిన పని నేను చేయాలి. ఎక్కడ తప్పు జరగక్కుండా.. కచ్చితంగా క్యాలెండర్‌ ప్రకారం నెల నెలా బటన్‌ నొక్కడం నేను చేయాలి. ఈ నెలలో ఈ పథకం ఇస్తామని మొట్టమొదటిసారిగా బడ్జెట్‌ అన్నదానికి నిర్వచనం మార్చాం. 


గతంలో ఇలా ఎప్పుడూ క్యాలెండర్‌ ప్రకారం జరగలేదు. అదే విధంగా నేను చేయాల్సిన పని నేను చేయాలి.. మీరు చేయాల్సింది మీరు చేయాలి. నాకు ఎన్ని సమస్యలున్నా వాటిని అధిగమించి ప్రజల సమస్యలను నా సమస్యలు కన్నా ఎక్కువని గమనించి.. వాటిని తీర్చే విధంగా బటన్‌ నొక్కే కార్యక్రమం నేను చేయాలి. అదే విధంగా మీరు చేయాల్సినవి మీరు చేయాలి. ఈ రెండూ జరగాలి..' అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో విశాఖ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు.


Also Read: Krishna Passed Away: ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ షేక్.. వరుసగా 12 సినిమాలు ఫ్లాప్


Also Read: Diabetes Control Tips: డయాబెటిస్‌కు ఇలా చెక్ పెట్టండి.. మీ ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook