CM Jagan Review Meeting on Education: స్కూళ్లకు వస్తున్న విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్‌ ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళుతుందని.. పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నామని చెప్పారు. ఇంటర్మీడియట్‌ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుందని.. ఆ తరువాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్‌ చేస్తున్నామని.. డ్రాప్‌అవుట్‌ లేకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలని అధికారులకు సూచించారు. సోమవారం విద్యాశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలన్నారు. గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని ఆదేశించగా.. తాజాగా సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ కోర్సులు ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సు ఉండనుంది. వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్‌ కోర్సు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. 


1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు ప్రారంభించాలని.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి సంవత్సరం సమీక్ష నిర్వహించుకుని.. అందుకు తగిన మార్పులు చేసుకోవాలని చెప్పారు. టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదన్నారు. స్కూలు విద్యార్థులకు టోఫెల్‌ సర్టిఫికెట్‌ పరీక్షలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 3 నుంచి 5గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు  టోఫెల్‌ పరీక్షలు నిర్వహించి.. ఉత్తీర్ణులైన వారికి టోఫెల్‌ ప్రైమరీ సర్టిఫికెట్‌ అందజేయాలన్నారు. 6 నుంచి 10 గ్రేడ్ల వారికి జూనియర్‌ టోఫెల్‌ పరీక్షలు నిర్వహించాలని.. మొత్తం మూడు దశల్లో వీరికి టోఫెల్‌ పరీక్ష నిర్వహించాలన్ని చెప్పారు. ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్‌ నైపుణ్యాల పరీక్ష.. జూనియర్‌ స్టాండర్డ్‌ స్థాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్‌ నైపుణ్యాలను పరీక్షించాలన్నారు. 


Also Read: Summer Alert: ఠారెత్తనున్న ఎండలు, రానున్న 5 రోజుల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక జారీ


అనంతరం విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. వారు వినియోగస్తున్న తీరుపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ట్యాబ్‌లు ఎక్కడైనా రిపేరు వస్తే.. వెంటనే మరమ్మతు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పదోతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పిన అధికారులు.. ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. నో మొబైల్‌ జోన్స్‌గా ఎగ్జామ్ సెంటర్లను మార్చేశామని.. ఎవ్వరికీ కూడా మొబైల్‌ అనుమతించడం లేదన్నారు. చివరగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు–నేడు కింద పనులను ముఖ్యమంత్రి జగన్ అడిగి తెలుసుకున్నారు.


Also Read: PM Kisan Samman Yojana: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook